వివాహేతర సంబంధం: భర్త అడ్డుతొలగించుకోవాలని..

12 Mar, 2021 16:32 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఓ వ్యక్తిపై తుపాకితో కాల్పులు జరిపిన సంఘటన స్థానికంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే నిందితులు ఈ కేసులో పోలీసులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. చివరకు పోలీసులు ఈ కేసును చేధించగా విస్తుపోయే విషయాలు వెలుగు చుశాయి. వివాహేతర సంబంధమే ఈ ఘటనకు కారణమని పోలీసులు వెల్లడించారు. పోలీసుల సమాచారం ప్రకారం.. భీమ్‌రాజ్‌(45) అనే వ్యక్తి చిరాగ్‌ ఢిల్లీలో భార్య భాటియా(41)తో కలిసి నివసిస్తున్నాడు. భీమ్‌రాజ్‌ బీఎస్‌ఈఎస్‌లో పవర్‌ కాంట్రాక్ట్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో అతడి భార్య భాటియాకు 23 ఏళ్ల రోహన్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరిద్దరి విషయం తెలుసుకున్న భీమ్‌రాజ్‌ పలుమార్లు భార్యను మందలించాడు.

అయినా ఆమె మారలేదు. ఈ విషయాన్ని ప్రియుడు రోహన్‌తో చెప్పి భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో రోహన్‌ తనకున్న పలుకుబడిని ఉపయోగించుకుని ఓ దేశీయ తుపాకి కొని, బైకు నెంబర్‌ను మార్చాడు. బుధవారం భీమ్ రాజ్ కారులో వెళ్తుండగా బైక్‌పై వెంబడించి భీమ్‌రాజ్‌పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ భీమ్‌రాజ్‌ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా సంఘటనకు సంబంధించిన దృశ్యం కాస్తా సీసీ కెమెరాల్లో రికార్డయింది. సీసీ కెమెరా ఫుటేజ్‌ ఆధారంగా పోలీసుల ఆ బైక్‌ను కనుగొనె ప్రయత్నం చేశారు. అయితే నంబర్‌ ప్లెట్‌ మార్చడంతో పోలీసు బైక్‌ ఎవరిదో, నిందితుడు ఎవరో తెలుసుకోవడం కష్టంగా మారింది.  దీంతో ఈకేసును ఢిల్లీ పోలీసులు సవాలుగా తీసుకుని దర్యాప్తు చేపట్టారు. చివరికి సాంకేతిక ఆధారాలతో నిందితుడు రోహన్‌ను బుధవారం సాయంత్రం అరెస్ట్ చేశారు.

రోహన్ విచారించగా కొద్ది రోజుల కిందట జరిగిన ఓ చిన్న యాక్సిడెంట్‌లో తనకు, భీమ్ రాజ్‌కు మధ్య గొడవ జరిగిందని, అందుకే అతడిని చంపాలనుకున్నాను అంటూ ఓ కథ అల్లి ప్రియురాలిని తప్పించే ప్రయత్నం చేశాడు. అయితే ఈ విషయంలో పోలీసులకు అనుమానం రావడంతో తమదైన శైలిలో విచారించగా అసలు  విషయం బయటపడింది. తనకు, భాటియాకు మధ్య వివాహేతర సంబంధం ఉందని, ఆమె తన భర్త అడ్డు తొలగించాలని కోరడంతో ఈ దారుణానికి పాల్పడినట్టు స్పష్టం చేశాడు. దీంతో ఆమెను కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆసుపత్రిలో భీమ్ రాజ్ చికిత్స తీసుకుంటున్నాడు. అతడి ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు.

మరిన్ని వార్తలు