గచ్చిబౌలి హోటల్‌లో వ్యభిచారం... ఆరుగురి అరెస్టు

26 Mar, 2021 09:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, గచ్చిబౌలి: పోలీసులు ఓ హోటల్‌పై దాడి చేసి వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు. ఆరుగురు విటులతో పాటు ఆరుగురు యువతులను అదుపులోకి తీసుకోగా, నిర్వాహకులు మాత్రం పరారీలో ఉన్నారు. గచ్చిబౌలి సబ్‌ఇన్‌స్పెక్టర్‌ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...  కొండాపూర్‌ శ్రీరాంనగర్‌ కాలనీలో ఓ హోటల్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. యాంటీ ఉమెన్‌ ట్రాకింగ్‌ సెల్, గచ్చిబౌలి పోలీసులు బుధవారం రాత్రి సదరు హోటల్‌పై దాడి చేశారు.

విటులు బిజ్యూపాయల్‌(27), దీపక్‌కుమార్‌ (25), సంగం కిషోర్‌దాల్‌(24), నితిన్‌జాషన్‌ అలియాస్‌ ఆరుట్ల నిఖిల్‌ (31), బంది నారాయణ (38), వెంకటేష్‌గౌడ్‌(58)లను అరెస్ట్‌ చేశారు. నిందితుల నుంచి రూ 32,510 నగదు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.  పశ్చిమబెంగాల్‌కు చెందిన ముగ్గురు, ముంబైకి చెందిన ఇద్దరు, ఢిల్లీకి చెందిన ఒక యువతిని అదుపులోకి తీసుకొని రెస్క్యూ హోంకు తరలించారు. కాగా, నిర్వాహకులు ప్రభాకర్, సంజయ్, అజయ్‌ పరారీలో ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

చదవండి: 
పప్పులో కాలేసిన టెలీకాలర్‌, కట్‌చేస్తే న్యూడ్‌ వీడియో కాల్
వదినపై ముగ్గురు మరుదులు అత్యాచారం

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు