కీచక ఇన్‌స్పెక్టర్‌.. మైనర్‌ను వ్యభిచారకూపంలోకి ఆపై..

25 Nov, 2020 07:29 IST|Sakshi

సాక్షి, చెన్నై: 13 ఏళ్ల బాలికను బలవంతంగా వ్యభిచారకూపంలోకి దించి, లైంగిక దాడులకు పాల్పడిన కేసులో ఎన్నూరు ఇన్‌స్పెక్టర్‌ పుహలేంది బుక్కయ్యాడు. ఆయన్ను మహిళా పోలీసులు అరెస్టు చేశారు. వాషర్‌మెన్‌ పేట మహిళా పోలీసుల్ని షబీనా అనే మహిళ రెండు రోజుల క్రితం ఆశ్రయించింది. తన అక్క సమిత భానుతో పాటు మరి కొందరు 13 ఏళ్ల బాలికను బలవంతంగా వ్యభిచార కూపంలోకి దించారని, ఆమెపై ప్రతిరోజూ లైంగిక దాడి జరుగుతున్నట్టు ఫిర్యాదు చేశారు. ఈ సమాచారంతో ఇన్‌స్పెక్టర్‌ ప్రియదర్శిని నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. ఎనిమిది మందిని అరెస్టు చేసి కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ సమయంలో బీజేపీకి చెందిన రాజేంద్రన్‌ పోలీసులకు చిక్కాడు.   (డార్లింగ్‌ పేరుతో యూట్యూబ్‌లో భార్య నగ్న చిత్రాలు)

చిక్కిన ఇన్‌స్పెక్టర్‌... 
రాజేంద్రన్‌ వద్ద జరిపిన విచారణలో తాను, ఎన్నూరు నేర విభాగం ఇన్‌స్పెక్టర్‌ పుహలేంది ఆ బాలికపై పలుమార్లు లైంగిక దాడి చేసినట్టు చెప్పాడు. ఇన్‌స్పెక్టర్‌ పుహలేందిపై మహిళా పోలీసులు విచారణ చేపట్టారు. విచారణలో ఆ బాలికను తన వాహనంలో పుహలేంది తీసుకెళ్లినట్టు, రాజేంద్రన్‌ కార్యాలయంలోకి వెళ్లినట్టుగా ఆధారాలు చిక్కినట్టు సమాచారం. దీంతో పుహలేంది అడ్డంగా బుక్క య్యాడు. సోమవారం రాత్రి ఆయన్ను మహిళా ఇన్‌స్పెక్టర్‌ ప్రియదర్శిని నేతృత్వంలోని బృందం అరెస్టు చేసింది. లైంగిక దాడి కేసులో ఓ ఇన్‌స్పెక్టర్‌ అరెస్టు సమాచారం స్థానికంగా చర్చకు దారి తీసింది. ఆయనపై పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి కటకటాల్లోకి నెట్టారు. ఈ సమాచారంతో ఆ ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్‌ చేస్తూ పోలీసు యంత్రాంగం ఆదేశాలు జారీ చేసింది.   (సాఫ్ట్ వేర్ ఉద్యోగిని సజీవ దహనం చేసిన అత్తింటివారు)

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా