పోలీసోడి పాడుపని.. యువతితో పరిచయం పెంచుకుని..

18 Jul, 2021 06:54 IST|Sakshi

ప్రేమపేరుతో యువతిపై లైంగికదాడి   

మైసూరు(కర్ణాటక): పోలీసు ఇన్‌స్పెక్టర్‌.. యువతిని ప్రేమ, పెళ్లి పేరుతో నమ్మించి లైంగిక దాడికి పాల్పడిన సంఘటన మైసూరు నగరంలోని కృష్ణరాజ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగు చూసింది. బాధిత యువతి.. ఇన్‌స్పెక్టర్‌ మీద ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ప్రకారం... యువతిపైన లైంగికదాడికి పాల్పడిన వ్యక్తి విజయపుర (బిజాపుర)లో కేఎస్‌ఆర్‌పీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న తాయణ్ణ ధనసాగర్‌. గతంలో ఎస్‌ఐగా ఉన్న తాయణ్ణ ఫేస్‌బుక్‌ ద్వారా మైసూరుకు చెందిన యువతితో పరిచయం పెంచుకుని ఆమెతో రోజూ చాటింగ్‌ చేసేవాడు. తరువాత ఫోన్‌ నంబర్‌ తీసుకుని మాట్లాడేవారు.

గోవాకు విహారయాత్రలు..  
కొన్నాళ్లకు నిన్ను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని, నాకు ఇంకా పెళ్లి కాలేదు అని చెప్పడంతో యువతి నిజమేనని భ్రమించింది. యువతిని గోవాతో పాటు పలు విహార యాత్రలకు తీసుకెళ్లి శారీరకంగా వినియోగించున్నాడు. పెళ్లి చేసుకోవాలని యువతి కోరడంతో, నిన్ను పెళ్లి చేసుకోను. నాకు ఇప్పటికే పెళ్లయింది అని చావుకబురు చెప్పాడు. దీంతో మోసపోయినట్లు తెలుసుకున్న బాధిత యువతి కృష్ణరాజ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.   
 

మరిన్ని వార్తలు