గుంటూరు శ్రీను నేర చరిత్రపై ఆరా..

8 Jan, 2021 14:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హఫీజ్‌పేట భూ వ్యవహారంలో కిడ్నాప్‌ ముఠా నాయకుడు మాడాల శ్రీను నేరచరిత్రపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆరా తీస్తున్నారు. కిడ్నాప్‌ ముఠాలో కీలక వ్యక్తి గుంటూరుకు చెందిన శ్రీనుకు.. అఖిలప్రియ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా పేరు ఉంది. నంద్యాల ఉపఎన్నికలో  శ్రీను కీలకంగా వ్యవహరించారు. కిడ్నాప్‌ ప్లాన్‌ అంతా అతని కన్నుసన్నల్లోనే జరిగినట్లు సమాచారం. శ్రీనగర్‌ కాలనీలో ఐటీ అధికారుల డ్రెస్‌లను అద్దెకు తీసుకున్న శ్రీను.. సినీఫక్కీలో కిడ్నాప్‌కు ప్లాన్‌ చేసినట్లు తెలిసింది. భార్గవ్‌రామ్‌కు రైట్‌హ్యాండ్‌గా శ్రీను వ్యవహరిస్తున్నారు (చదవండి: అఖిలప్రియను అరెస్టు చేయకుంటే అనర్థాలెన్నో!)

కాగా, ప్రవీణ్‌ రావు తదితరుల్ని కిడ్నాప్‌ చేయడానికి అఖిలప్రియ దాదాపు 6 నెలల క్రితమే పథకం వేశారని అనుమానిస్తున్నారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న గుంటూరు శ్రీను నకిలీ నంబర్‌ ప్లేట్‌తో కూడిన వాహనంలో సంచరిస్తుండగా బోయిన్‌పల్లి పోలీసులు ఐదు నెలల క్రితమే పట్టుకున్నారు. అలా ఎందుకు చేశారని పోలీసులు ప్రశ్నించగా... తాను కొందరి కోసం పనిచేస్తుంటానని, ఈ నేపథ్యంలోనే ముప్పు పొంచి ఉండటంతో తరచూ వాహనం నంబర్‌ ప్లేట్లు మారుస్తుంటానని చెప్పి తప్పించుకున్నట్లు తెలిసింది. వాస్తవానికి అప్పట్లో నకిలీ నంబర్‌ ప్లేట్‌తో ప్రవీణ్‌రావు ఇంటి వద్ద రెక్కీ కోసమే గుంటూరు శ్రీను వెళ్లినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.(చదవండి: అఖిల ప్రియకు కోర్టులో చుక్కెదురు)

మరిన్ని వార్తలు