విద్యార్థిని స్నేహితుడే హతమార్చాడా..? 

30 Mar, 2022 01:55 IST|Sakshi

పదో తరగతి విద్యార్థిని హత్యపై దర్యాప్తు ముమ్మరం 

పదే పదే లైంగిక దాడికి అంగీకరించనందుకే ఘాతుకం? 

అదుపులో నలుగురు అనుమానితులు

తల్లిపాత్ర కూడా ఏమైనా ఉందా.. అనే కోణంలోనూ విచారణ  

వికారాబాద్‌: పదో తరగతి విద్యార్థిని హత్య ఘటనలో విస్మయకర విషయాలు బహిర్గతమైనట్టు తెలుస్తోంది. వికారాబాద్‌ జిల్లా అంగడి చిట్టెంపల్లిలో పదిహేనేళ్ల విద్యార్థినిని హతమార్చిన ఘటన సోమవారం వెలుగుచూసిన విషయం తెలి సిందే. కేసు నమోదు చేసిన పోలీసులు నాలుగు బృందా లుగా ఏర్పడి అనేక కోణాల్లో దర్యాప్తును ముమ్మ రం చేశారు. ఆ విద్యార్థినితో ప్రేమ పేరిట సన్నిహితంగా మెలిగిన ఓ యువకుడిని ప్రధాన నిందితుడిగా భావిస్తూ  దర్యాప్తు చేపట్టారు.

అతనితోపాటు మరో స్పేహితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మంగళవారం విద్యార్థిని తల్లిని, ఆమెతో సన్నిహితంగా ఉండే మరోవ్యక్తిని సైతం అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో తల్లిపాత్ర కూడా ఏమైనా ఉందా..? అనే కోణంలోనూ విచారిస్తున్నట్టు సమాచారం. పోలీసులు హైదరాబాద్‌ నుంచి రప్పించిన క్లూస్‌ టీం ద్వారా మంగళవారం మరోసారి ఆధారాలు సేకరించారు. 

ఆ యువకుడే హత్య చేశాడా?: కొంతకాలంగా విద్యార్థినిని ప్రేమపేరిట వేధిస్తున్న యువకుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో బయటపడిందని తెలుస్తోంది. సోమవా రం తెల్లవారుజామున 3–00 గంటల ప్రాంతంలోనేవిద్యార్థినిని ఇంటి నుంచి తీసుకువెళ్లిన యువకుడు అప్పటికే పదే పదే లైంగిక దాడికి పాల్పడినట్టు, మరోసారి బలవంతంగా లైంగిక దాడికి యత్నించగా విద్యార్థిని అంగీకరించకపోవటంతో హత్య చేసినట్టు తెలుస్తోంది.

విద్యార్థినిని తీసుకువెళ్లటానికి ముందే అతడు స్నేహితుడితో కలసి మద్యం తాగినట్టుగా పోలీసుల విచారణలో అంగీకరించినట్టు సమాచారం. అయితే లైంగికదాడికి పాల్పడింది అతడొక్కడేనా.. అతడి స్నేహితుల పాత్ర కూడా ఉందా.. అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

అయితే నిందితులు వెల్లడించిన విషయాలకు సాంకేతికతను జోడించి సరిపోల్చి నిర్ధారణకు వచ్చేందుకే కొంత సమయం తీసుకుంటున్నట్టు పోలీసువర్గాలు భావిస్తున్నాయి. ఎస్పీ కోటిరెడ్డి, అడిషనల్‌ ఎస్పీ రషీద్, డీఎస్పీ శ్రీనివాస్‌ ఈ దర్యాప్తును పర్యవేక్షిస్తుండగా సీఐ వెంకటరామయ్య, ఎస్‌ఐ శ్రీశైలం ఇతర పోలీసు బృందాలతో కలసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు బుధవారం కేసు విషయాలు వెల్లడించే అవకాశముంది.    

మరిన్ని వార్తలు