హాస్టల్‌ సమీపంలో గుట్టుచప్పుడు కాకుండా  వ్యభిచారం 

2 May, 2022 19:43 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కడప అర్బన్‌(వైఎస్సార్‌ జిల్లా): కడప నగరంలోని ప్రకాష్‌నగర్‌లో ఉన్న ప్రభుత్వ హాస్టల్‌ సమీపంలో వ్యభిచార గృహంపై ఆదివారం సాయంత్రం పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో నిర్వాహకురాలు వరదచంద్రిక ప్రతిభా భారతిని, కడప బాలాజీనగర్‌కు చెందిన మహిళను, వెస్ట్‌ బెంగాల్‌ వర్దమాన్‌ జిల్లాకు చెందిన మహిళను అరెస్ట్‌ చేశారు. వీరితో పాటు విటులు వెంకటరమణ, రాం మనోహర్, వరసుబ్బారెడ్డిలు ఉన్నారు. వీరి వద్ద నుంచి రూ.3450 నగదును, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
చదవండి: వదినతో గొడవ.. పల్సర్‌ బైకుకు నిప్పు.. ఆపై పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి..   

మరిన్ని వార్తలు