అమ్మాయిలను తీసుకొచ్చి గుట్టుగా వ్యభిచారం.. పోలీసుల అదుపులో మహిళ, విటుడు

8 Feb, 2022 20:10 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఖిలా వరంగల్‌: వరంగల్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు వ్యభిచార గృహంపై దాడి జరిపి ఇద్దరు మహిళలను రక్షించారు. నగరంలోని శివనగర్‌కు చెందిన బోనాసి స్వర్ణలత అలియాస్‌ కావేరి కొన్నాళ్లుగా తన ఇంట్లో రహస్యంగా వ్యభిచారం సాగిస్తోంది. పేదరికం, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వరంగల్‌కు చెందిన ఒకరు, కాకినాడకు చెందిన మరో యువతిని బలవంతంగా ఈ రొంపిలోకి దింపి వ్యభిచారం సాగిస్తున్నట్లు సమాచారం.

చదవండి: లిప్ట్ ఇస్తానంటూ నమ్మించి బైక్‌పై ఎక్కించుకుని..

ముందస్తు సమాచారంతో టాస్క్‌ఫోర్స్‌  ఏఎస్పీ వైభవ్‌ రఘునాథ్‌ గైక్వాడ్‌ ఆదేశాల మేరకు శివనగర్‌లోని ఆమె ఇంటిపై సోమవారం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. ఈ దాడిలో వ్యభిచార నిర్వాహకురాలితోపాటు ఇద్దరు మహిళల్ని, ఖిలా వరంగల్‌కు చెందిన విటుడు స్వామిని అధికారులు అదుపు లోకి తీసుకున్నారు. వారినుంచి నాలుగు సెల్‌ఫోన్లు, రూ.5,260 నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసుకొని విచారణ కోసం మిల్స్‌ కాలనీ పోలీసులకు నిందితులను అప్పగించి నట్లు టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్లు, సంతోష్, శ్రీనివాస్‌జీ తెలిపారు. 

మరిన్ని వార్తలు