వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

7 Jun, 2021 11:09 IST|Sakshi

కర్నూలు: కర్నూలు నగరం మాధవీనగర్‌ శివారులోని స్టేట్‌బ్యాంక్‌ కాలనీలో నిర్వహిస్తున్న వ్యభిచార గృహంపై మూడో పట్టణ పోలీసులు దాడులు నిర్వహించారు. డోన్‌ మండలం ఆవులదొడ్డి గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు, కీర్తి కలిసి కొంత కాలంగా స్టేట్‌ బ్యాంక్‌ కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని వ్యభిచార గృహం నడుపుతున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు మూడో పట్టణ పోలీసులు దాడి చేసి నిర్వాహకుడు వెంకటేశ్వర్లును అరెస్టు చేశారు.

అలాగే విటుడు జాకీర్‌హుసేన్‌ను కూడా అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు, ఆళ్లగడ్డ ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి వారి చేత వ్యభిచారం చేయిస్తున్నట్లు విచారణలో తేలింది. మహిళలకు కౌన్సెలింగ్‌ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిర్వాహకుడు వెంకటేశ్వర్లుతో పాటు కీర్తిపై కేసు నమోదు చేశారు. అయితే కీర్తి పరారీలో ఉండటంతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

నమ్మించి మోసం చేశాడని యువతి ఫిర్యాదు 
మిడుతూరు: పగిడ్యాల మండలం ముచ్చుమర్రి గ్రామానికి చెందిన రాజ్‌ కుమార్‌ అనే వ్యక్తి తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని మిడుతూరు ఎస్సీకాలనీకి చెందిన అహల్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా అనుభవించి కొన్నాళ్లుగా మొహం చాటేశాడని ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ చెన్నయ్య ఆదివారం తెలిపారు.

చదవండి: వ్యభిచారం చేయకపోతే చంపేస్తామంటూ...
విషాదం: క్షణికావేశం..తీసింది ప్రాణం
..
      

మరిన్ని వార్తలు