పైకి కాఫీ బార్‌ షాపు.. లోపలే ఉంది అసలు మ్యాటర్‌!

11 May, 2022 08:45 IST|Sakshi

యలహంక(బెంగళూరు): కాఫీ బార్‌ పేరుతో అక్రమంగా హుక్కా బార్‌ నడిపిస్తున్న ముగ్గురిని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం పోలీసులు అరెస్టు చేశారు. దేవనహళ్లి తాలూకా కన్నమంగళ గేటు సమీపంలో కాఫీబార్‌ పేరుతో హుక్కా బార్‌ నడిపిస్తూ యువతీ, యువకులను ఆకర్షిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి ముగ్గురిని అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేశారు.

మరో ఘటనలో..
టెంపోను ఢీకొన్న కారు
తుమకూరు: వేగంగా వస్తున్న కారు డివైడర్‌ను దాటి అవతలి రోడ్డుపై వస్తున్న టెంపో ట్రావెలర్‌ను ఢీకొన్న ఘటనలో కారులోని ముగ్గురు మరణించారు. జిల్లాలోని కుణిగల్‌ దగ్గర బేగూడరు వద్ద 75వ హైవేపై మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. మృతులు బెంగళూరు సంజత్‌ నగరకు చెందిన రఘు (38), హెబ్బాల బీఎల్‌ సర్కిల్‌కు చెందిన విజయ్‌ (36), సంతోష్‌ (28)లు. కారు డ్రైవర్‌ లోకేష్‌తో పాటు తీవ్రంగా గాయపడిన మరో ముగ్గురిని బెంగళూరుకు తరలించారు. టెంపోలో ఉన్న వసంత అనే మహిళకు కూడా గాయాలు తగిలాయి. కుణిగల్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

చదవండి: పెళ్లయిన నాటి నుంచి పుట్టింటికి పంపించని భర్త.. దీంతో భార్య..

మరిన్ని వార్తలు