పేకాడుతూ పట్టుబడిన తెలుగు తమ్ముళ్లు ! 

28 Nov, 2022 03:48 IST|Sakshi
పేకాటలో పట్టుబడిన టీడీపీ నేతలతో పోలీస్‌ అధికారులు

హనుమాన్‌జంక్షన్‌లో పేకాట శిబిరంపై పోలీసుల మెరుపుదాడి 

టీడీపీ గన్నవరం ఇన్‌చార్జి బచ్చుల అనుచరులే నిర్వాహకులు 

నగదు బదులుగా కాయిన్లతో హైటెక్‌ పేకాట 

కేసు మాఫీకి విశ్వయత్నం

హనుమాన్‌జంక్షన్‌ రూరల్‌ (గన్నవరం): ఓ పేకాట శిబిరంపై పోలీసులు చేసిన మెరుపుదాడిలో తెలుగుదేశం పార్టీ నేతలు పట్టుబడిన ఘటన సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళితే.. టీడీపీ బాపులపాడు కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు అట్లూరి శ్రీనివాసరావు, గార్లపాటి రాజేశ్వరరావు ఆధ్వర్యంలో కృష్ణా జిల్లా హనుమాన్‌జంక్షన్‌ సమీపంలోని పామాయిల్‌ తోటల్లో గుట్టుచప్పుడు కాకుండా పేకాట శిబిరం నిర్వహిస్తున్నారు.

సమాచారం అందుకున్న ఎస్‌ఐ వాసా వెంకటేశ్వరరావు తన సిబ్బందితో కలిసి ఆదివారం ఆకస్మికంగా దాడి చేశారు. దీంతో టీడీపీ నాయకులు, నిర్వాహకులు అట్లూరి శ్రీనివాసరావు, గార్లపాటి రాజేశ్వరరావుతో పాటు గా మేడికొండ రామకృష్ణ, కనకమేడల సుదర్శనరావు, తోట శ్రీరామ్, పత్రివట కృష్ణమోహన్‌ (గుడివాడ), యల మంచిలి వెంకటేశ్వరరావు, అల్లాడిశెట్టి రాఘవరావు, కనకమేడల వెం కటేశ్వరరావు, యలమంచిలి రవీంద్రకుమార్‌ పట్టుబడ్డారు.

వారి వద్ద రూ.10,500 స్వాధీనం చేసుకున్నారు. అయితే  పోలీసులను తప్పుదారి పట్టించేందుకు నగదు బదులుగా కాయిన్‌లతో పేకాట నిర్వహిస్తుండడంతో ఘటనాస్థలంలో దొరికిన కాయిన్ల ఆధారంగా రూ.లక్షల్లోనే పందేలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కాయిన్లను స్వాధీనం చేసుకుని ఆ దిశగా విచారణ చేపట్టారు. 

పోలీసుల వైఖరిపై అనుమానాలు..  
టీడీపీ గన్నవరం ఇన్‌చార్జి, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ప్రధాన అనుచరులైన అట్లూరి శ్రీనివాసరావు, గార్లపాటి రాజేశ్వరరావు పట్టుబడటంతో పోలీసులపై కేసు మాఫీ చేసేందుకు తీవ్రమైన ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. పేకాట శిబిరంపై దాడి చేసి టీడీపీ నేతలను అదుపులోకి తీసుకున్న తర్వాత వివరాలు బహిర్గతం చేయకుండా పోలీసులు తాత్సారం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.  పేకాట శిబిరం వద్ద పెద్ద మొత్తంలో డబ్బు దొరికినప్పటికీ కేవలం రూ.10 వేలు మాత్రమే కేసులో చూపించారనే ఆరోపణలు పోలీసులపై వస్తున్నాయి  

క్యాసినో కింగ్‌ చికోటి ప్రవీణ్‌తో సంబంధాలు! 
హనుమాన్‌జంక్షన్‌ సమీపంలో పేకాట శిబిరం నిర్వహిస్తూ పోలీసులకు పట్టుబడిన టీడీపీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు అట్లూరి శ్రీనివాసరావు, గార్లపాటి రాజేశ్వరరావుకు క్యాసినో కింగ్‌ చికోటి ప్రవీణ్‌తో సంబంధాలు ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే పలుమార్లు జంక్షన్‌ ప్రాంతం నుంచి పలువురిని గోవా, నేపాల్, బ్యాంకాక్, హాంకాంగ్‌కు జూదం ఆడించేందుకు వీళ్లు పలువురిని తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. 

మరిన్ని వార్తలు