గుట్టుచప్పుడు కాకుండా.. సెలూన్‌ ముసుగులో..

16 Jan, 2021 07:27 IST|Sakshi

గుట్టురట్టు చేసిన పోలీసులు  

నెల్లూరు(క్రైమ్‌): మెట్రో నగరాలకే పరిమితమైన వెరైటీ మసాజ్‌లు, క్రాస్‌ మసాజ్‌లు జిల్లాకూ పాకాయి. స్పా సెంటర్లు, సెలూన్లను హంగూ, ఆర్భాటాలతో నిర్వహిస్తూ కస్టమర్లను ఆకర్షించి.. వాటి ముసుగులో వ్యభిచార కేంద్రాలను నిర్వహిస్తున్నారు. మాగుంట లేఅవుట్లో ఓ స్పా సెంటర్‌లో వ్యభిచార కేంద్ర నిర్వహణను గతంలో గుట్టురట్టు చేసిన పోలీసులు తాజాగా నగరంలోని క్రాంతినగర్‌ స్కూల్‌ సమీపంలో సెలూన్‌ ముసుగులో నిర్వహిస్తున్న వ్యభిచార కేంద్రంపై దాడి చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. నెల్లూరు అరవిందనగర్‌ ఎక్స్‌టెన్షన్‌కు చెందిన సుధాకర్‌రాజు బొల్లినేని ఆస్పత్రి సమీపంలోని క్రాంతినగర్‌ స్కూల్‌ ప్రాంతంలో ప్లాటినం సెలూన్‌ అండ్‌ బ్యూటీపార్లర్‌ ముసుగులో మసాజ్‌ కేంద్రంతో పాటు వ్యభిచార కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. చదవండి: విగ్రహం మలినం కేసు: టీడీపీ నేత అరెస్టు

కోల్‌కతా, ముంబై, తదితర నగరాల నుంచి అందమైన యువతులను తీసుకొచ్చి వారితో గుట్టుచప్పుడు కాకుండా సెలూన్లో వ్యభిచారం చేయిస్తున్నారు. దీంతో పెద్ద సంఖ్యలో అక్కడికి రావడం ప్రారంభమైంది. అయితే ఈ విషయం బయటకు పొక్కకుండా నిర్వాహకుడు జాగ్రత్తలు తీసుకున్నారు. సెలూన్లో వ్యభిచారం జోరుగా సాగుతోందనే పక్కా సమాచారంతో దర్గామిట్ట ఇన్‌స్పెక్టర్‌ మిద్దె నాగేశ్వరమ్మ తన సిబ్బందితో కలిసి నిఘా ఉంచారు. అక్కడ వ్యభిచారం జరుగుతోందనే సమాచారంతో గురువారం దాడి చేశారు. సెక్స్‌వర్కర్, విటుడు, స్పా సెంటర్‌లో పనిచేస్తున్న యువకుడ్ని అదుపులోకి తీసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేశారు. సెక్స్‌ వర్కర్‌ను హోమ్‌కు తరలించారు. నిర్వాహకుడు పరారీలో ఉండటంతో గాలింపు చర్యలు చేపట్టామని ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. చదవండి: వైఎస్సార్‌సీపీ నేతపై టీడీపీ వర్గీయుల దాడి 

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు