పైకి మసాజ్ సెంటర్లు.. లోపల షాకింగ్‌ దృశ్యాలు.. స్పా ముసుగులో..

3 Nov, 2022 11:14 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, విజయవాడ: విజయవాడ నగరంలోని స్పా, మసాజ్, ఫిట్నెస్‌ సెంటర్‌లతో పాటు పలు హోటళ్లపై బుధవారం పోలీసులు దాడులు నిర్వహించారు. వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో 131 స్పా, మసాజ్‌ సెంటర్లు, హోటళ్లలో విస్తృతంగా తనిఖీలు చేశారు.

వ్యభిచారం నిర్వహిస్తున్న ఏడు కేంద్రాలను సీజ్‌ చేసి 23 మంది నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. అనధికారికంగా కొనసాగుతున్న 93 మసాజ్‌ సెంటర్‌లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ టి.కె.రాణా విజయవాడ మునిసిపల్‌ కార్పొరేషన్, కమర్షియల్‌ ట్యాక్స్, ఫైర్‌ సేఫ్టీ అధికారులకు  లేఖలు రాశారు.
చదవండి: భర్త అల్లిన కట్టుకథ.. మహిళ హత్య కేసులో షాకింగ్‌ ట్విస్ట్‌

మరిన్ని వార్తలు