కూకట్‌పల్లి: రెండు వ్యభిచార గృహాలపై దాడులు, ఇద్దరు అరెస్టు

6 Nov, 2021 14:30 IST|Sakshi
నిందితులు శ్రీనివాస్‌ రావు, నాగ వెంకటేశ్వర రావు

సాక్షి, కూకట్‌పల్లి: రెండు వేర్వేరు చోట్ల వ్యభిచార గృహాలపై దాడులు నిర్వహించిన కేపీహెచ్‌బీ పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేపీహెచ్‌బీ సీఐ లక్ష్మీ నారాయణ తెలిపిన వివరాలు.. కేపీహెచ్‌బీ 7వ ఫేజ్‌లోని బాస్కెట్‌ బాల్‌ గ్రౌండ్‌ వద్ద ఎల్‌ఐజీ గృహంలో వ్యభిచారం నిర్హహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఆకస్మికంగా దాడులు నిర్వహించి పల్లికల శ్రీనివాసరావును మరో యువతిని అదుపులోకి తీసుకున్నారు.
చదవండి: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ఇద్దరు మహిళలను రెడ్‌హ్యండెడ్‌గా

అనంతరం యువతిని రెస్క్యూ హోంకు తరలించగా.. శ్రీనివాసరావును రిమాండ్‌కు తరలించారు.. అదే విధంగా కేపీహెచ్‌బీ కాలనీలో రోడ్డు నెంబర్‌3లో ఓ గృహంలో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు సాయంత్రం 6..30 గంటలకు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా సుంగులూరి నాగ వెంకటేశ్వరరావుతో పాటు ఒక మహిళను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ జరిపి వారిపై కేసు నమోదు చేసి నిందితులిద్దరిని రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు