సెలూన్‌ ముసుగులో మసాజ్‌ సెంటర్‌.. మహిళలను మభ్యపెట్టి వారితో..

8 Apr, 2022 15:57 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కుషాయిగూడ( హైదరాబాద్‌): సెలూన్‌ ముసుగులో నిర్వహిస్తున్న మసాజ్‌ సెంటర్‌పై ఎస్‌ఓటీ పోలీసులు దాడులు జరిపి నిర్వాహకులను అరెస్టు చేసిన ఘటన కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. రాధిక చౌరస్తా సమీపంలో నిర్వహిస్తున్న ప్యారీస్‌ సెలూన్‌ అండ్‌ స్పాలో అమాయక మహిళలను మభ్యపెట్టి వారితో మసాజ్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. విషయం తెలిసిన మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు ఆకస్మిక దాడులు జరిపి నిర్వాహకులు శివసాయినగర్‌ కాలనీకి చెందిన జంపాల శివ, ఈస్ట్‌ మారెడుపల్లికి చెందిన కొలిపాక నవీన్, ఓ విటుడుతో పాటు మహిళను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

మరో ఘటనలో..

తాగిన మైకంలో అక్కను కొట్టిన తమ్ముడు...అక్క మృతి 
బాలానగర్‌( హైదరాబాద్‌): తాగిన మైకంలో ఓ వ్యక్తి అక్కను కొట్టడంతో దెబ్బలకు తాళలేక ఆమె మృతిచెందింది. ఈ సంఘటన బాలానగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గురువారం జరిగింది. సీఐ ఎండి వాహిదుద్దీన్‌ తెలిపిన మేరకు.. బాలానగర్‌ డివిజన్‌ గిరినగర్‌కు చెందిన కనకలక్ష్మి (40) గత నెల రోజుల నుంచి తల్లిదండ్రులతోనే ఉంటుంది. అయితే తమ్ముడు మల్లేష్‌ అక్క కనకలక్ష్మితో గొడవపడి ఈ నెల 5న ఆమెను తీవ్రంగా కొట్టాడు. ఆమె స్పృహతప్పి పడిపోవడంతో తల్లిదండ్రులు హుటాహుటిన సమీపంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకుని వెళ్లారు. వైద్యం పొందుతూ ఆమె మృతి చెందింది. మృతురాలి కూతురు హిమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడు మల్లేష్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

చదవండి: ‘జైద్‌ లే నాన్నా.. ఒక్కసారి ఇటు చూడు.. ఎంత పనిచేశావ్‌’

మరిన్ని వార్తలు