గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం.. ఇద్దరు అరెస్టు

11 Nov, 2021 07:50 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి,  మైసూరు(కర్ణాటక) : మైసూరు నగరం, విజయనగర 2వ స్టేజ్‌లో ఉన్న ఒక ఇంటిలో వేశ్యావాటిక గృహంపై పోలీసులు  దాడి చేశారు. ఈ దాడిలో   ఇద్దరు విటులను, ఒక నేపాలీ యువతిని పోలీసులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. కొంతకాలంగా అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని పోలీసులకు స్థానికులు సమాచారం అందించారు. ఈ క్రమంలో నిఘా ఉంచిన అధికారులు ఆకస్మికంగా దాడిచేశారు. కాగా,  నిందితులనుంచి నాలుగు సెల్‌ఫోన్లు, రూ.1,18,500 స్వాధీనం చేసుకున్నారు.   

మరిన్ని వార్తలు