నాలుగు రోజులుగా ఠాణాలో పందెం కోళ్లు! 

29 Oct, 2021 09:29 IST|Sakshi
కిన్నెరసాని రూరల్‌ పోలీసుస్టేషన్‌లో కోడిపుంజులు

సాక్షి, పాల్వంచ(ఖమ్మం): నాలుగు రోజులుగా పందెం కోళ్లకు ఠాణాలో పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. వాటికి రేషన్‌ బియ్యాన్ని అందిస్తూ పహరా కాస్తున్నారు. విషయమేంటంటే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ మండలం దంతలబోరు శివారు అటవీ ప్రాంతంలో కోడి పందేలు నిర్వహిస్తుండగా పా ల్వంచ రూరల్‌ ఎస్సై సుమన్‌ ఆధ్వర్యంలో ఈనెల 25న దాడి చేశారు. ఈ సందర్భంగా మూడు పందెం కోళ్లతో పాటు ఐదుగురిని అరెస్టు చేశారు.

అనంతరం నిందితులకు నోటీసులు జారీ చేసి వదిలేసిన పోలీసులు కోడిపుంజులను గురువారం వరకు విడుదల చేయలేదు. కిన్నెరసాని రూరల్‌ పోలీసుస్టేషన్‌ ప్రాంగణంలోనే కోడిపుంజులను బంధించారు. పుంజు ల రంగుల ఆధారంగా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని, తదుపరి ఆదేశాల మేరకు నిర్ణయం తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. 

చదవండి: తల్లి బతికుండగానే పెద్దకర్మ! 

>
మరిన్ని వార్తలు