అడిగినంత ఇస్తే.. ఎయిర్‌పోర్టులో మంచి ఉద్యోగం అని చెప్పడంతో..

30 Nov, 2021 09:41 IST|Sakshi

సాక్షి,కర్నూలు: ఓర్వకల్లు ఎయిర్‌పోర్టులో ఉద్యోగం ఇప్పిస్తానని అందులో పనిచేసే ఒక వ్యక్తి రూ. 4 లక్షలు డబ్బులు తీసుకుని మోసం చేశాడని ఆత్మకూరుకు చెందిన గంగాధర్‌ఆచారి ఎస్పీ సీహెచ్‌.సుధీర్‌కుమార్‌రెడ్డికి ఫిర్యాదు చేశాడు. సంతకాలు ఫోర్జరీ చేసి తమ్ముడు ఆస్తిని ఆక్రమించుకున్నాడని, న్యాయం చేయాలని కర్నూలు ఎర్రబురుజుకు చెందిన పద్మమ్మ కోరారు.

నెల్లూరుకు చెందిన వెల్‌పే కంపెనీ పేరుతో రెండు శాతం కమీషన్‌ ట్రేడింగ్‌ ఇస్తామని నమ్మించి డబ్బులు తీసుకుని ఒక వ్యక్తి మోసం చేశాడని నంద్యాలకు చెందిన బాధితులు బాలరాజు, నారాయణ, రామచంద్రగౌడ్‌ తదితరులు ఫిర్యాదు చేశారు. రెండో పట్టణ పోలీసుస్టేషన్‌ పక్కనున్న కార్యాలయంలో ఎస్పీ సోమవారం స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. మొత్తం 88 ఫిర్యాదులు రాగా వాటిపై చట్టపరిధిలో విచారణ జరిపించి, న్యాయం చేస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు. స్పెషల్‌బ్రాంచ్‌ డీఎస్పీ వెంకటాద్రి, సీఐలు అబ్దుల్‌గౌస్, గుణశేఖర్‌బాబు, దిశా వన్‌స్టాప్‌ సెంటర్‌ నిర్వాహకురాలు శిల్ప తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

చదవండి: కాలం మారింది.. ఇక మీ టేబుల్‌ వద్దకు వెయిటర్స్‌ రారు, అంతా మీ చేతుల్లోనే!

మరిన్ని వార్తలు