పాకిస్తాన్‌కు అనుకూలంగా నినాదాలు.. కేసు నమోదు

1 Sep, 2021 21:02 IST|Sakshi
గురుగ్రామ్‌ పోలీసులు( ఫైల్‌ ఫోటో)

గురుగ్రామ్‌: పాకిస్తాన్‌కు అనుకూలంగా ఓ వ్యక్తి నినాదాలు చేస్తూ.. అపార్టుమెంట్‌ వాసులకు ఇబ్బంది కలిగించాడు. దీంతో వారు అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గురుగ్రామ్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్ సొసైటీ అపార్టుమెంట్‌లో నివాసం ఉండే ఓ వ్యక్తి తన ఫ్లాట్‌ బాల్కానీలో నిలబడి పాకిస్తాన్‌కు అనుకూలంగా.. ‘పాకిస్తాన్‌ జిందాబాద్‌.. పాకిస్తాన్‌ జిందాబాద్‌..’ నినాదాలు చేశాడు. దీంతో అతని నినాదాలకు ఇబ్బందిగా భావించిన అపార్టుమెంట్‌ వాసులు స్థానిక పోలీసులు ఫిర్యాదు చేశారు.

చదవండి:   ‘తాలిబన్‌ ఉగ్రవాద సంస్థా? కాదా? సమాధానం చెప్పాలి’

కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న నిందితుని కోసం గాలిస్తున్నామని తెలిపారు. అయితే నిందితుని భార్య కూడా అపార్టుమెంట్‌ వాసులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన భర్త తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడని, అందుకోసం చికిత్స తీసుకుంటున్నాడని తెలిపింది. అందువల్లనే నినాదాలు చేశాడని తెలిపింది. కొంతమంది అపార్టుమెంట్‌ వాసులు తమ ఫ్లాట్‌ వద్దకు వచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నారని పేర్కొంది. అయితే నిందితుడు ఒత్తిడి ఉండి  నినాదాలు చేశాడా?  లేదా? ఉద్దేశపూర్వంగా చేశాడా? అనే కోణంలో లోతుగా దర్యాప్తు చేస్తామని పోలీసులు పేర్కొన్నారు.  

చదవండి: షాకింగ్‌.. రెస్టారెంట్‌ యజమానిని కాల్చి చంపిన స్విగ్గీ ఏజెంట్

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు