షాకింగ్‌.. రెస్టారెంట్‌ యజమానిని కాల్చి చంపిన స్విగ్గీ ఏజెంట్

1 Sep, 2021 15:16 IST|Sakshi
సునీల్ అగర్వాల్(ఫైల్‌)

గ్రేటర్‌ నోయిడా(లక్నో): స్విగ్గీకి చెందిన డెలివరీ ఏజెంట్ ఆర్డర్ సిద్ధం చేయడంలో ఆలస్యమైందని ఢిల్లీ సమీపంలోని గ్రేటర్ నోయిడాలో ఓ రెస్టారెంట్ యజమానిని కాల్చి చంపాడు. పోలీసులు కేసు నమోదు చేసి డెలివరీ ఏజెంట్‌ని గుర్తించడానికి ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ‘‘స్విగ్గీ ఏజెంట్ చికెన్ బిర్యానీ, పూరీ సబ్జీ ఆర్డర్ సేకరించడానికి ఓ రెస్టారెంట్‌కు వెళ్లాడు. బిర్యానీ సిద్ధంగా ఉన్నప్పటికీ రెస్టారెంట్‌లో పనిచేసే ఓ వ్యక్తి ఆర్డర్‌కు మరికొంత సమయం పడుతుందన్నాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

చదవండి: స్విగ్గీ న్యూ డెసిషన్‌... ఇవి కూడా డెలివరీ చేస్తుందట

ఈ క్రమంలో రెస్టారెంట్‌ ఉద్యోగిని డెలివరీ ఏజెంట్‌ అసభ్యంగా దూషించాడు. కాగా రెస్టారెంట్ యజమాని సునీల్ అగర్వాల్ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించాడు. అయితే డెలివరీ ఏజెంట్ అతని స్నేహితుడి సహాయంతో అతని తలపై కాల్చాడు’’ అని పోలీసులు తెలిపారు. రెస్టారెంట్ ఉద్యోగి, ఇతర సిబ్బంది అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆ వ్యక్తి మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. హత్యకు గురైన వ్యక్తిని సునీల్ అగర్వాల్‌గా గుర్తించారు. అతడు మిత్రా అనే నివాస సముదాయం లోపల ఓ రెస్టారెంట్ కలిగి ఉన్నాడని పోలీసులు తెలిపారు.

చదవండి: చికెన్‌.. చికెన్‌.. మటన్‌.. చికెన్‌

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు