టీడీపీ కార్యాలయ ఆవరణలో తెలంగాణ మద్యం

12 Feb, 2021 08:20 IST|Sakshi
మద్యాన్ని చూపుతున్న ఎస్‌ఐ సుబ్బరామిరెడ్డి

కేసు నమోదు చేసిన పోలీసులు 

గడివేముల(కర్నూలు జిల్లా): జిల్లాలోని గడివేముల టీడీపీ కార్యాలయ ఆవరణలో తెలంగాణ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌ఐ సుబ్బరామిరెడ్డి చెప్పారు. పార్టీ కార్యాలయం సమీపంలో తెలంగాణ మద్యం ఉందన్న సమాచారం రావడంతో గురువారం సిబ్బందితో దాడులు నిర్వహించినట్టు చెప్పారు. 121 క్వార్టర్స్‌ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని, టీడీపీ కార్యకర్త వడ్డె రామకృష్ణ పరారీలో ఉన్నట్టు తెలిపారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లకు పంచేందుకే మద్యాన్ని తెచ్చినట్టు తెలుస్తోంది.
(చదవండి: ఓటర్లకు మంత్రం.. టీడీపీ క్షుద్ర తంత్రం!)
ఏపీ ప్రభుత్వం మరో విప్లవాత్మక నిర్ణయం   

మరిన్ని వార్తలు