సారా ప్యాకింగ్‌ కేంద్రాలపై దాడులు

29 Apr, 2022 11:28 IST|Sakshi

పార్వతీపురం టౌన్‌: కొమరాడ మండలం పరశురాంపురం గ్రామంలో ఎస్‌ఈబీ టాస్క్‌ఫోర్స్‌ సీఐ గోపాలకృష్ణ  ఆధ్వర్యంలో  సిబ్బంది గురువారం  దాడులు చేసి 30లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పార్వతీపురం పట్టణంలోని ఇందిరాకాలనీకి చెందిన సొండి రాజేష్‌ విక్రాంపురం గ్రామంలో సారా రవాణా చేస్తున్న సమయంలో స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసునమోదు చేసి  రిమాండ్‌ నిమిత్తం పార్వతీపురం జుడీషియల్‌ మెజిస్ట్రేట్‌  వద్ద హాజరుపర్చామని తెలిపారు.  

మరో సంఘటనలో  ఎస్‌ఈబీ సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎల్‌. ఉపేంద్ర పార్వతీపురం మండలం కృష్ణపల్లి గ్రామ సమీపంలో నిర్వహించిన దాడుల్లో 160లీటర్ల సారా, 100 ప్యాకెట్లు సారా స్వాధీనం చేసుకున్నారు. పార్వతీపురం మున్సిపాల్టీ పాత రెల్లివీధికి చెందిన సొండి చంద్రపై కేసు నమోదు చేశారు. అలాగే పాత రెల్లివీధి సమీపంలో తుప్పల్లో దాచిపెట్టిన 60లీటర్లసారా, 50 ప్యాకెట్ల సారాను స్వాధీనం చేసుకున్నారు.   

1,400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం  
సాలూరు: మండలంలోని  పెద్దవలస గ్రామ సమీపంలో బెల్లపు ఊటను ధ్వంసం చేసినట్లు  స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఇన్‌స్పెక్టర్‌  ఈశ్వరరావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన మాట్లాడుతూ, సిబ్బందితో కలిసి  పెద్దవలస సమీపంలో సారా స్థావరాలపై దాడి చేసి సారా  తయారికి సిద్ధం  చేసిన  1,400 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేసి కేసు నమోదు చేశామని తెలిపారు.  

వేపాడ మండలంలో 1000 లీటర్లు..  
వేపాడ:   కృష్ణారాయుడుపేట గ్రామ సమీపంలో నిర్వహించిన దాడుల్లో సారా తయారీకి సిద్ధం చేసిన 1000 లీటర్లు బెల్లం ఊటను గుర్తించి ధ్వంసం చేసినట్లు  స్పెషల్‌ ఎన్‌పోర్స్‌మెంట్‌ బ్యూరో సీఐ సీహెచ్‌ రాజేశ్వరి, ఎస్సై పి.నరేంద్ర  తెలిపారు. అనంతరం కృష్ణారాయుడుపేటలో నిర్వహించిన పరివర్తన కార్యక్రమంలో సీఐ మాట్లాడుతూ సారా నిర్మూలనకు గ్రామస్తులు,  çమహిళలు, సహకారం ఉండాలన్నారు.  

(చదవండి:

మరిన్ని వార్తలు