పోలీస్‌పై దాడి.. దొంగపై కాల్పులు

12 Feb, 2021 21:30 IST|Sakshi

బెంగళూరు : యలహంక పరిధిలో శబరీష్‌ అలియాస్‌ అప్పి (27) అనే రౌడీషీటర్‌పై పోలీసులు కాల్పులు జరపడంతో గాయపడ్డాడు. ఇతడు పలు దోపిడీలు, వాహనాల చోరీ కేసుల్లో నిందితుడు. బుధవారం అర్ధరాత్రి సమయంలో నాగరాజ్‌ అనే వ్యక్తి కారులో వెళ్తుండగా కోగిల్‌ క్రాస్‌ వద్ద శబరీ అతడి స్నేహితులు మురళి, ఇమ్రాన్, రంజిత్‌తో కలిసి అడ్డగించాడు. రూ 700 నగదు , మొబైల్‌ ఫోన్, ఏటీఎం కార్డు, కారు దొంగిలించారు. బాధితుడు వెంటనే యలహంక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

సీఐ రామకృష్ణారెడ్డి నేతృత్వంలో గురువారం తెల్లవారుజామున కోగిల్‌ క్రాస్‌కు వచ్చారు. అక్కడే ఉన్న దుండగులు పారిపోవడానికి ప్రయత్నించారు. శబరీను కానిస్టేబుల్‌ శివకుమార్‌ పట్టుకోవడానికి ప్రయత్నించగా కొడవలితో దాడి చేశాడు. సీఐ వెంటనే పిస్టల్‌తో కాల్పులు జరపడంతో నిందితుని కాలికి గాయమైంది. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు