పోలీసుల టార్చర్‌.. పురుగుల మందు తాగి ఐదుగురు మృతి..

9 Nov, 2021 08:02 IST|Sakshi
చికిత్స సమయంలో వృద్ధ జంట మునియప్ప,  నారాయణమ్మ  

సాక్షి, కోలారు(కర్ణాటక): సంబంధం లేకపోయినా పోలీసులు కేసు పెడతామని బెదిరించారనే ఆవేదనతో కుటుంబంలోని 5 మంది ఆదివారం పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించిన వారిలో అందరూ కన్నుమూశారు. మునియప్ప (75), భార్య నారాయణమ్మ(70), కుమారుడు బాబు (45), మనవరాలు గంగోత్రి (17) కోలారులోని జాలప్ప ఆస్పత్రిలో సోమవారం వేకువన చనిపోయారు. కుమార్తె పుష్ప రాత్రికి కన్నుమూసింది. 

కేసుతో సంబంధం లేదన్నా.. 
వివరాలు.. నగరంలోని గల్‌పేట పరిధిలోని కారంజికట్టలో నివాసం ఉంటున్నారు. అక్టోబర్‌ 18వ తేదీన తాలూకాలోని హొన్నేహళ్లి గ్రామానికి చెందిన సత్య, సుమిత్ర దంపతుల ఆడ శిశువును వారికి తెలిసిన మహిళ ఎత్తుకెళ్లింది. ఇందులో పుష్ప కూడా నిందితురాలని కోలారు నగర మహిళా పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మహిళా పోలీసులు.. గీతా, పుష్పలను స్టేషన్‌కు తీసుకువచ్చి విచారించగా ఏ సంబంధం లేదని పుష్ప తెలిపింది.

నేరం ఒప్పుకోక పోతే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తామని పోలీసులు ఆమెను ఒత్తిడి చేశారు. ఈ నేపథ్యంలో పుష్ప, ఆమె కుటుంబీకులు భయాందోళనకు గురయ్యారు. కుటుంబం పరువు పోతుందనే ఆవేదనతో ఆదివారం ఐదుగురూ కలిసి పురుగుల మందు తాగారు. స్థానికులు గమనించి జిల్లా ఆస్పత్రికి, అక్కడి నుంచి ఆర్‌ ఎల్‌ జాలప్ప ఆస్పత్రికి తరలించారు. చికిత్స ఫలించక మృతి చెందారు.

చదవండి: పరాయి పురుషుల వద్దకు వెళ్లాలని బలవంతం చేస్తున్నాడు!

మరిన్ని వార్తలు