ఎంత పనిచేశావ్‌ నాని... తల్లిదండ్రులు ఫోన్‌ దాచి పెట్టారని..

18 Apr, 2022 13:18 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ప్రత్తిపాడు(గుంటూరు జిల్లా): తల్లిదండ్రులు ఫోన్‌ దాచి పెట్టి, ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదన్న కారణంతో పాలిటెక్నిక్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నియోజకవర్గ కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ప్రత్తిపాడు గ్రామానికి చెందిన కారసాల నాని (17) వట్టిచెరుకూరు మండలం ఐదవమైలులోని ప్రియదర్శిని ఇంజినీరింగ్‌ కళాశాలలో పాలిటెక్నిక్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.

చదవండి: ల్యాప్‌టాప్‌ పేలి.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌కు తీవ్ర గాయాలు

తన మొబైల్‌ లో ఎక్కువగా వీడియో గేమ్‌లు ఆడు తున్నాడన్న కారణంగా తల్లిదండ్రులు నాని మొబైల్‌ను లాక్కుని, దాచి పెట్టారు. నాని ఎన్నిసార్లు అడిగినా తల్లిదండ్రులు తిరిగి ఇవ్వలేదు. దీంతో మనస్తాపానికి గురై ఈ నెల 13వ తేదీన ఎలుకల మందు తిన్నాడు. వాంతుల తో బాధపడుతూ తీవ్ర ఇబ్బంది పడుతున్న నానీని గమనించిన తల్లిదండ్రు లు గుంటూరులోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం నాని మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు  ఎస్‌ఐ ప్రతాప్‌ కుమార్‌ తెలిపారు. 

మరిన్ని వార్తలు