తండ్రి ఆవేదన: కష్టపడి చదివించుకున్నా.. అలా చేస్తుందనుకోలేదు..

15 Dec, 2021 18:08 IST|Sakshi

సాక్షి, ప్రకాశం: పరీక్షల్లో ఫెయిల్‌ కావడంతో మనస్థాపం చెందిన పాలిటెక్నిక్‌ విద్యార్థిని హాస్టల్‌ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన కొత్త పట్నం మండలం ఈతముక్కల గ్రామం మహిళా పాలిటెక్నిక్‌ కాలేజీలో మంగళవారం జరిగింది, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా, ఈపూరు మండలం, ఆర్‌ ముప్పాళ్ళ గ్రామానికి చెందిన మట్టా రామాంజనేయులు కుమార్తె  మట్టా దివ్య (17) పాలిటెక్నిక్‌ కాలేజీలో  ఈసీఈ  సెకండ్‌ ఇయర్‌ చదువుతోంది. సోమవారం సాయత్రం వెలువడిన  పాలిటెక్నిక్‌ మొదటి ఏడాది  ఫలితాల్లో  ఏడు సబ్జెక్ట్స్‌గాను అయిదు ఫెయిల్‌ అయ్యింది.

ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం కాలేజీకి వెళ్లొచ్చిన దివ్య హాస్టల్‌ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. మధ్యాహ్నం విద్యార్ధినులు హాస్టల్‌కు వచ్చేసరికి దివ్య ఉరికి వేలాడుతూ కనిపించడంతో కాలేజీ ప్రిన్సిపాల్‌ సుశీల్‌ కుమార్‌ ప్రియకు సమాచారం ఇచ్చారు. ప్రిన్సిపాల్‌ పోలీసులకు, తల్లిదండ్రులకు ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. 

చదవండి: (నువ్వురాకపోతే చచ్చిపోతా.. నువ్వు అవి మానేస్తానంటేనే వస్తా..)

దివ్య  క్లాస్‌లో ఎప్పుడూ ఫస్ట్‌  మార్కులతో వచ్చేవని తోటి విద్యార్థులు చెప్పారు.  మంగళవారం ఉదయం అందిరతోపాటే సక్లాస్‌కు హాజరైన దివ్య తాను పరీక్షలు బాగా రాశానని, రీఎరిఫీకేషన్‌ పెట్టించాలని చెప్పినట్లు తమతో చెప్పినట్లు పేర్కొన్నారు. కాగా కాలేజీలో మొదటి ఏడాది విధ్యార్థులు 75 మంది ఉండగా వారిలో   33 మంది విద్యార్థినులు మాత్రమే పాస్‌ అవ్వడం గమనార్హం. 

కష్టపడి చదివించుకున్నా
నేను ముప్ఫాళ్ల గ్రామంలో కాంట్రాక్ట్‌ పద్దతిలో స్వీపరగా పనిచేస్తాను. నాకు వచ్చేది రూ.6 వేలు జీతం. ఎల్‌కేజీ నుంచి పదోవతరగతి వరకు ప్రవేటు స్కూల్‌లో డబ్బులు ఖర్చు పెట్టి చదివించుకున్నారు. నేను చేసే పని నా కుమర్తె చేయకూడదని  కష్టపడి చదివించుకుంటున్నారు.  ఈ విధంగా ఆత్మహత్య చేసుకుంటుందని నేను అనుకోలేదని   కుమార్తె  ముందు  కుప్పకూలీ పోయాడు.  కేసు నమోదు చేసి పోష్టమార్టన్‌ నిమెత్తం  ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.

మరిన్ని వార్తలు