మైనర్లను రేప్‌ చేసిన వ్యక్తికి జీవిత ఖైదు

7 Aug, 2021 06:35 IST|Sakshi

న్యూఢిల్లీ: 7, 9 వయసులు ఉన్న ఇద్దరు మైనర్లపై పలు మార్లు అత్యాచారానికి పాల్పడినందుకుగానూ 76 ఏళ్ల పూజారికి ఢిల్లీలోని ఓ కోర్టు జీవిత ఖైదు విధించింది. తీర్పు సందర్భంగా మెజిస్ట్రేట్‌ విజేత సింగ్‌ రావత్‌ మాట్లాడుతూ.. పవిత్రమైన గుడి ఆవరణలోనే పూజారి విశ్వ బంధు మైనర్లపై అత్యాచార పర్వం కొనసాగించాడని పేర్కొన్నారు. ఇలాంటి చర్యల ఫలితంగా బాధితులైన మైనర్లు భవిష్యత్తుపై భయం పెట్టుకున్నారని తీర్పులో తెలిపారు.  ఇలాంటి మృగాన్ని బయటకు వదిలేస్తే కోర్టు కూడా తన బాధ్యతలో విఫలమైనట్లే అని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. విశ్వబంధుకు యావజ్జీవ ఖైదుతో పాటు  రూ. 60 వేల జరిమానా విధించారు. బాధితులకు రూ. 7.5 లక్షల చొప్పున సాయం అందించాలని ఆదేశించారు. 

మరిన్ని వార్తలు