మృతదేహం ఇచ్చేందుకు రూ.5 లక్షల డిమాండ్‌ 

8 May, 2021 04:35 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిపై కేసు  

గుంటూరు ఈస్ట్‌: కోవిడ్‌ బారినపడి చికిత్స పొందుతూ మరణించిన వ్యక్తి మృతదేహాన్ని ఇచ్చేందుకు సుమారు రూ.5 లక్షలు డిమాండ్‌ చేసిన ప్రైవేట్‌ ఆస్పత్రి యాజమాన్యంపై గుంటూరు కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశా రు. ఎస్‌హెచ్‌వో రాజశేఖరరెడ్డి కథనం మేరకు.. యడ్లపాడు మండలం తిమ్మాపురానికి చెందిన యనమదల ప్రసాద్‌ సమీప బంధువులైన పి. బాబు, శివపార్వతి దంపతులు కొద్దిరోజుల కిం దట  గుంటూరులోని నారాయణ సూపర్‌ స్పె షాలిటీ హాస్పిటల్‌లో కోవిడ్‌ చికిత్స నిమిత్తం చేరారు. కరోనా నుంచి కోలుకున్న శివపార్వతి డిశ్చార్జి అయ్యారు. అక్కడే చికిత్స పొందుతూ గురువారం రాత్రి బాబు మృతిచెందారు.

ఆస్పత్రి యాజమాన్యం రూ.4,98,558 చెల్లించి మృతదేహాన్ని తీసుకెళ్లాలని సూచించింది. డబ్బులు చెల్లించలేకపోతే మృతదేహాన్ని కార్పొరేషన్‌ పారిశుధ్య కార్మికులకు అప్పగిస్తామని పేర్కొంది. ఈ విషయాన్ని యనమల ప్రసాద్‌.. ఆస్పత్రిలో తనిఖీ చేసేందుకు వచ్చిన మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ బి.కిషోర్‌కు తెలిపారు. దీంతో డాక్టర్‌ కిషోర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొత్తపేట పోలీసులు విచారించి నారాయణ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి యాజమాన్యంపై కేసు నమోదు చేశారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు