ప్రైవేటు ఆసుపత్రిలో పాజిటివ్‌.. ప్రభుత్వ ఆసుపత్రిలో నెగెటివ్‌..

4 May, 2021 08:47 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, వేములవాడ(సిరిసిల్ల): పట్టణంలోని మల్లారం రోడ్డులో ఉన్న మాతృశ్రీ అనే ఆసుపత్రిలో కరోనాపై తప్పుడు రిపోర్టు ఇవ్వడంతో ఆసుపత్రిపై కేసు నమోదు చేసినట్లు టౌన్‌ సీఐ వెంకటేశ్‌  తెలిపారు. చిట్టి మంగమ్మ అనే పేషెంట్‌ స్వల్ప లక్షణాలతో ఆసుపత్రికి చేరుకోవడంతో కరోనా టెస్టులు నిర్వహించి పాజిటివ్‌ వచ్చిందని అడ్మిట్‌ చేసుకున్నారు.

ఇందుకు రూ.లక్షన్నర కావాలని చెప్పడంతో తన వద్ద డబ్బులు లేవని పేర్కొంటూ స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి మరోసారి కరోనా టెస్టు చేయించగా ఆమెకు నెగెటివ్‌ రావడంతో పోలీస్‌ స్టేషన్లో  ఫిర్యాదు చేసింది.  నెగటివ్‌ రిపోర్టు ఆధారంగా ఆమె ఫిర్యాదు మేరకు మాతృశ్రీ ఆసుపత్రిపై కేసు నమోదు చేసుకుని విచారణ అనంతరం చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు