ఫేస్‌బుక్‌ పరిచయం.. బాలికపై ప్రైవేటు టీచర్‌ లైంగికదాడి

17 Jun, 2021 20:56 IST|Sakshi

ఫేస్‌బుక్‌ పరిచయం.. ఆపై వంచన

సాక్షి, మదనపల్లె(చిత్తూరు): బాలికకు ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయమైన ఓ ప్రైవేట్‌ పాఠశాల ఉపాధ్యాయుడు ప్రేమిస్తున్నట్లు నమ్మించి, పలుసార్లు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన మదనపల్లె పట్టణంలో బుధవారం వెలుగు చూసింది. వన్‌టౌన్‌ పోలీసుల కథనం మేరకు వివరాలు. పట్టణానికి చెందిన బాలిక(17)తో ఎన్‌వీఆర్‌ లే అవుట్‌కు చెందిన ప్రైవేట్‌ పాఠశాల ఉపాధ్యాయుడు దినేష్‌(26), ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం పెంచుకున్నాడు. గత 9 నెలలుగా వీరు ఫేస్‌బుక్‌లో చాటింగ్‌లు చేసుకునేవారు. ఈ నేపథ్యంలో తాను ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.

బాలికపై పలుసార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే తాను ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. కొన్ని రోజులుగా ఈ విషయం గోప్యంగా ఉంచిన బాలిక, దినేష్‌ వేధింపులు ఎక్కువ కావడంతో ఈ విషయం తన చిన్నమ్మకు చెప్పింది. వారిద్దరి ఫిర్యాదు మేరకు దినేష్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ లోకేష్‌ తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. 

చదవండి: 
హైదరాబాద్‌లో హిజ్రాల హల్‌చల్‌.. డబ్బులు డిమాండ్‌.. ఆపై!
ప్రియుడితో గొడవ.. ఆ నీళ్లు తాగితే బాధ మర్చిపోతావ్‌!

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు