ప్రైవేటు టీచర్‌ బాగోతం.. ఆన్‌లైన్‌ క్లాసుల పేరిట బాలికను..

29 Jul, 2021 10:46 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, సంగారెడ్డి (మెదక్‌): ఆన్‌లైన్‌ క్లాస్‌ల పేరిట ఓ ప్రైవేటు టీచర్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డ సంఘటన బుధవారం పట్టణ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ రమేశ్‌ వివరాల ప్రకారం ప్రైవేటు టీచర్‌గా పనిచేస్తున్న వినయ్‌రాజ్‌ అదే స్కూల్లో చదువుతున్న అమ్మాయిని ఆన్‌లైన్‌ క్లాస్‌ల పేరిట లైంగికంగా వేధించసాగాడు.

ఈ క్రమంలో యువతి గత కొన్ని రోజులుగా తీవ్రంగా ఇబ్బందిపడుతుంది. దీంతో అమ్మాయి తల్లిదండ్రులకు తన బాధను తెలియజేసింది. వెంటనే వారు పోలీసులకు  ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.  

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని అదృశ్యం 
పటాన్‌చెరు టౌన్‌: సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని అదృశ్యమైన సంఘటన పటాన్‌చెరు పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై సాయిలు కథనం ప్రకారం పటాన్‌చెరు పట్టణం జేపీ కాలనీకి చెందిన విఠల్‌ కూతురు రాయినీ అంబిక గచ్చిబౌలిలో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. ఈ క్రమంలో మంగళవారం ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. రాత్రి వరకు అంబిక ఇంటికి రాకపోవడం, బంధువుల వద్ద వెతికినా  ఆచూకి లభించకపోవడంతో అంబిక సోదరుడు విశాల్‌ పోలీసులకు పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.   

మరిన్ని వార్తలు