మల్లాపూర్‌: మసాజ్‌ ముసుగులో వ్యభిచారం.. ఏడుగురు అరెస్ట్‌

27 Nov, 2021 11:33 IST|Sakshi
పోలీసుల అదుపులో మసాజ్‌ సెంటర్‌ నిర్వాహకులు 

సాక్షి, మల్లాపూర్‌: మసాజ్‌ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మసాజ్‌ సెంటర్‌పై గత రెండు రోజులక్రితం దాడి చేసిన సంఘటన మరువక ముందే మరో క్రాస్‌ జెండర్‌ మసాజ్‌ సెంటర్‌పై నాచారం పోలీసులు దాడి  చేశారు. సీఐ కిరణ్‌కుమార్‌ తెలిపిన మేరకు.. నాచారం హెచ్‌ఎంటీనగర్‌ ప్రధాన రహదారిలో బాలానీనగర్‌ జవహర్‌నగర్‌కు చెందిన రజిత అలియాస్‌ సుప్రియ స్పైసీ హెయిర్‌ బ్యూటీపార్లర్‌ సెంటర్‌లో క్రాస్‌ జెండర్‌ మసాజ్‌ నడుపుతున్నారు.
చదవండి: విదేశాల నుంచి విద్యార్థినులను రప్పించి వ్యభిచారంలోకి..

గురువారం రాత్రి పోలీసులు మసాజ్‌ సెంటర్‌పై దాడి చేసి  నిర్వాహకులు ఎం.రజిత (37),  ఆమె భర్త నాగేందర్‌ (39),  బోడుప్పల్‌ హేమానగర్‌కు చెందిన సహాయకుడు కె.శివ (34), వీరితో పాటు మసాజ్‌ సెంటర్‌లో పని  చేస్తున్న ముగ్గురు మహిళలు, కస్టమర్‌ బండి బాలకృష్ణను (34) అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2వేలు, ఫోన్‌ పే స్కానర్, ఎంటీఎం కార్డు, స్వైప్‌ మీషన్‌  పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకోని రిమాండ్‌కు తరలించిన్నట్లు సిఐ తెలిపారు. 

మరిన్ని వార్తలు