మాదాపూర్‌: గుట్టుచప్పుడు కాకుండా ఓయో రూమ్‌లో వ్యభిచారం.. 8 మంది అరెస్ట్‌

22 Feb, 2022 08:31 IST|Sakshi

సాక్షి, మాదాపూర్‌: ఓయో రూంలలో గుట్టుచప్పుడు కాకుండా అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్న నిందితులను ఆదివారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాదాపూర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్‌లోని జైహింద్‌ ఎన్‌క్లేవ్‌ రహదారిలో ఓయో క్వాలియాలో వ్యభిచారం నిర్వహిస్తున్నారని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఈనెల 20వ తేదీ రాత్రి పోలీసులు ఓయో రూంపై దాడి చేసి ఇద్దరు నిర్వాహకురాళ్ళు, ఓ విటుడితో పాటు 5 మంది మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వీరివద్ద నుండి మొబైల్‌ఫోన్స్‌ స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  
చదవండి: భార్యపై అనుమానం, వేధింపులు.. ఎంతకీ భర్త మారకపోవడంతో..

మహిళపై హత్యాచారం? 
మాదాపూర్‌: మాదాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఓ మహిళ(34)పై గుర్తుతెలియని దుండగులు అత్యాచారం చేసి..అనంతరం హత్య చేసినట్లు తెలుస్తోంది. మాదాపూర్‌ సిఐ రవీంద్రప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం హైటెక్‌సిటీ రైల్వేస్టేషన్‌ సమీపంలోని పాత ఔట్‌పోస్టు వద్ద సోమవారం ఓ మహిళ మృతదేహాన్ని గుర్తించారు. ఆదివారం రాత్రి ఆమెపై అత్యాచారం జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. తలకు తీవ్రమైన గాయాలుండడంతో రాయితో బలంగా కొట్టినట్లుగా భావిస్తున్నారు. సంఘటనా స్థలంలో క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టారు. మహిళకు సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ఈఘటనకు సంబంధించి అనుమానితులైన కొందర్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.  

మరిన్ని వార్తలు