Prostitution Racket In Karimnagar: వ్యభిచార కూపాలు.. విచ్చలవిడిగా సాగుతున్న దందా

22 Jun, 2022 17:04 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

 ‘సాక్షి’ కథనంతో కదిలిన ఖాకీలు, అప్పటికే కిలేడీల అప్రమత్తం

సాక్షి, కరీంనగర్‌: జిల్లాలోని తంగళ్లపల్లి, సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో వ్యభిచార దంగా జోరుగా సాగుతోంది. అయితే ఈ మురికి కూపంలోకి బాలికలను బలవంతంగా దింపుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. తంగళ్లపల్లి, సిరిసిల్లలో సుమారు 12 మంది బాలికలు ఈ వృత్తిలో కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ మధ్య తంగళ్లపల్లికి చెందిన ఓ మహిళ విజయవాడకు చెందిన 3 ఏళ్ల చిన్నారిని రూ.2 లక్షలకు కొనుగోలు చేయగా ఏపీ పోలీసులు వచ్చి సదరు మహిళను అదుపులోకి తీసుకుని పాపను తల్లిదండ్రులకు అప్పగించారు. ఈ విషయాన్ని ‘సాక్షి’లో ఈ నెల 15న ‘వ్యభిచార ముఠా గుట్టురట్టు’ శీర్షికన ప్రచురించడంతో వ్యభిచార మాఫియాలో మానవ అక్రమ రవాణా కూడా జరుగుతున్నట్లు బహిర్గతమైంది.

పోలీసుల్లోనే లీకు వీరులు..?
జిల్లా ఎస్పీ రాహుల్‌హెగ్డే ఆదేశాల మేరకు మంగళవారం సాయంత్రం రూరల్‌ సీఐ అనిల్‌కుమార్, తంగళ్లపల్లి ఎస్సై లక్ష్మారెడ్డి, ఇల్లంతకుంట ఎస్సై మహేందర్, సిబ్బంది వేశ్య గృహాలను తనిఖీ చేశారు. కాగా, తనిఖీలకు ముందే బాలికలను లీకు వీరుల మూలంగా తప్పించినట్లు చర్చ జరుగుతోంది. కొంత మంది పోలీస్‌ సిబ్బంది వేశ్య గృహాల వారికి ముందుగానే లీక్‌ చేస్తూ అప్రమత్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. వ్యభిచార కూపాల్లో ఉన్న బాలికలకు సంబంధించి పక్కా ఆధారాలు, డీఎన్‌ఏ టెస్టులు వంటివి నిర్వహిస్తే వారి సంతామేనా..? కాదా..? అని రుజువు చేసి బాలికలకు విముక్తి కలిగించవచ్చు. 

తంగళ్లపల్లిలో తనిఖీలు చేస్తున్న పోలీసులు

వేశ్య గృహాల తనిఖీ
సిరిసిల్లక్రైం: సిరిసిల్ల టౌన్, తంగళ్లపల్లి మండల కేంద్రంలోని వేశ్య గృహాలను మంగళవారం పోలీసులు ఏకకాలంలో తనిఖీ చేశారు. తనిఖీ ల్లో బాలికలు పట్టుబడలేదని వెల్లడించారు. ఆ యా గృహాల్లో ఉంటున్న వారికి కౌన్సెలింగ్‌ ని ర్వహించారు. ధ్రువీకరణ పత్రాలు లేకుండా ని వాసం ఉండడానికి వీలు లేదని హెచ్చరించా రు. కుటుంబీకులు తప్ప వేరే వాళ్లు ఉంటే వారి కి సంబంధించిన అన్ని వివరాలు ఉండాలన్నా రు. వ్యభిచార గృహాలుగా పేరున్న వారందరి ఆధార్‌ గుర్తింపులు ఇవ్వాలని ఆదేశించారు. సీఐ అనిల్‌ కుమార్, ఎస్‌ఐలు రఫీక్‌ఖాన్, చిననాయక్, మహిళా పోలీసు సిబ్బంది ఉన్నారు.  

మరిన్ని వార్తలు