Hyderabad: వ్యభిచార గృహంపై దాడి.. ఇద్దరు అరెస్ట్‌

12 May, 2022 07:33 IST|Sakshi

సాక్షి, మియాపూర్‌: అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారం మేరకు మియాపూర్‌ పోలీసులు దాడి చేసి ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. ఎస్‌ఐ యాదగిరిరావు తెలిపిన ప్రకారం.. మంగళవారం రాత్రి 7.30 గంటల సమయంలో మియాపూర్‌లోని గోకుల్‌ ప్లాట్స్‌ ఆదర్శనిలయం అపార్ట్‌మెంట్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు అపార్ట్‌మెంట్‌లోని 501 ప్లాట్‌లో దాడి చేశారు.

మహబూబ్‌నగర్ జిల్లా అనంతవరం మండలం, అంబగిరి గ్రామానికి చెందిన  వి.బాలు(37), అదే విధంగా రంగారెడ్డి జిల్లా ఫరూక్‌ మండలం, చిలకమర్రికి చెందిన అంతారం కృష్ణయ్య (46)లు ఉన్నారు. వారితో పాటు ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. బాలు, కృష్ణయ్యలను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇద్దరు మహిళలను రెస్క్యూ హోమ్‌కు తరలించినట్లు తెలిపారు. కాగా నిర్వాహకుడు ప్రభాకర్‌రెడ్డి పరారీలో ఉన్నట్లు  తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.   

చదవండి: (Hyderabad: వ్యభిచార గృహంపై దాడి.. ఐదుగురి అరెస్టు)

మరిన్ని వార్తలు