వ్యభిచార గృహంపై దాడి: ఇద్దరి అరెస్టు

13 May, 2022 06:31 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, హైదరాబాద్‌(నాగోలు): వ్యభిచార గృహంపై ఎల్‌బీనగర్‌ పోలీసులు దాడి చేసి ఇద్దరిని  అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల కథనం ప్రకారం... నాగోలు బండ్లగూడ కృషినగర్‌లో నివాసం ఉండే ఓ మహిళ స్థానికంగా  టైలరింగ్‌ చేస్తోంది. ఈ వృత్తి ద్వారా వచ్చే డబ్బులు సరిపోక ఇతర ప్రాంతాల నుంచి మహిళలను తీసుకొచ్చి వ్యభిచారం చేయిస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు గురువారం ఆమె నివాసంపై దాడి చేయగా వ్యభిచారం చేస్తూ అనూష, కొత్తపేటకు చెందిన గురుజాల అనిల్‌కుమార్‌ పోలీసులకు పట్టుబడ్డారు పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసి వారి వద్ద నుంచి నగదు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. 

చదవండి: (వివాహేతర సంబంధం.. మహిళతో న్యూడ్‌ కాల్స్‌.. వాటిని రికార్డ్స్‌ చేసి!)

మరిన్ని వార్తలు