Mahabubabad Crime: వ్యభిచార ముఠా గుట్టు రట్టు.. ఐదుగురి అరెస్ట్‌.. నలుగురు పరారీ

13 Apr, 2022 06:52 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, మహబూబాబాద్‌ రూరల్‌ : వ్యభిచార ముఠా గుట్టును టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు రట్టు చేశారని మహబూబాబాద్‌ జిల్లా ఎస్పీ శరత్‌ చంద్రపవార్‌ అన్నారు. మహబూబాబాద్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ శరత్‌ చంద్రపవార్‌ కేసు వివరాలు వెల్లడించారు. నమ్మదగిన సమాచారం మేరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో మహబూబాబాద్‌ టాస్క్‌ ఫోర్సు పోలీసులు మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో కొంత మంది ముఠాగా ఏర్పడి వ్యభిచారం నిర్వహిస్తునట్టుగా గుర్తించారు.

వెంటనే టాస్క్‌ ఫోర్సు ఇన్‌స్పెక్టర్‌ గండ్రతి మోహన్, మహబూబాబాద్‌ టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎడ్లపల్లి సతీష్‌ వారి సిబ్బందిని తీసుకుని జిల్లా కేంద్రంలోని రెడ్డిబజార్లో గల ఒకగృహం మీద దాడి చేశారు. ఆ గృహంలో సర్వోదయ సంస్థలో పని చేస్తున్న కొందరు వ్యక్తులు, ఇతర ప్రాంతాలకు చెందిన కొంతమంది వ్యభిచారం నిర్వహిస్తున్న కొందరిని అదుపులో తీసుకున్నారు. పట్టుబడిన వారిలో కురవి మండలంలోని తాట్యా తండా గ్రామ పరిధిలోగల పిల్లిగుండ్ల తండాకు చెందిన బానోత్‌ రవి, రాజోలు గ్రామ పరిధిలోగల హరిసింగ్‌ తండాకు చెందిన మాలోత్‌ మంగిలాల్‌ అలియాస్‌ లోకేష్, బంచరాయి తండాకు చెందిన భూక్యా కన్కి, మహబూబాబాద్‌ మండలంలోని పర్వతగిరికి చెందిన బాదావత్‌ సరోజ, సోమ్లా తండాకు చెందిన బదావత్‌ రాములు (విటుడు) ఉన్నారు. పై వ్యక్తులు మహబూబాబాద్‌ చుట్టుపక్కల ప్రాంతాల మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తున్నారు.

చదవండి: (దారుణం: ఒక ఇంట్లో రెండేళ్లపాప నాన్నను ఇంకెపుడు చూడలేదు.. మరో ఇంట్లో) 

అదే మాదిరిగా మంగళవారం కూడా కొంతమంది మహిళలతో వ్యభిచారం నిర్వహిస్తుండగా టాస్క్‌ ఫోర్సు, పోలీసులు పట్టుకున్నారు. వారివద్ద నుంచి పది మొబైల్‌ ఫోన్లు, ఒక ఆటో, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వేణు, పద్మ, స్వాతి, శారద పరారీలో ఉన్నారు. ఈ కేసులో విశ్వసనీయ సమాచారం సేకరించి నేరస్తులను పట్టుకున్న టాస్క్‌ ఫోర్సు ఇన్‌స్పెక్టర్‌ మోహన్, టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ సతీప్, టాస్క్‌ ఫోర్సు ఎస్సైలు జగదీశ్, రామారావు, టాస్క్‌ ఫోర్సు సిబ్బందికి ఎస్పీ శరత్‌ చంద్రపవార్‌ రివార్డులు అందజేసి అభినందించారు. 

మరిన్ని వార్తలు