Hyderabad: రాజేంద్ర నగర్‌లో వ్యభిచార ముఠా గుట్టురట్టు

10 Nov, 2022 14:25 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, హైదరాబాద్‌: ఓ హోటల్‌లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న వ్యభిచారాన్ని యాంటి హ్యూమన్‌ ట్రాకింగ్‌ యూనిట్‌ బృందం గుట్టురట్టు చేసింది. ముగ్గురు నిందితులను గచ్చిబౌలి పోలీసులకు అప్పగించగా, ఆరుగురు యువతులను రెస్క్యూ హోంకు తరలించనున్నారు.

గచ్చిబౌలి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్న అంజయ్యనగర్‌లోని ఓ హోటల్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సైబరాబాద్‌ యాంటి హ్యూమన్‌ ట్రాకింగ్‌ యూ నిట్‌ బృందం బుధవారం సాయంత్రం 6.30 గంటలకు దాడి చేశారు. ఉజబెకిస్తాన్‌కు చెందిన యువతితో పాటు ఇద్దరు ఢిల్లీ, ఇద్దరు వెస్ట్‌ బెంగాల్, ఒకరు ముంబైకి చెందిన యువతులకు విముక్తి కలిగించారు.

అమీర్‌పేట్‌ మార్కెట్‌కు చెందిన జితేందర్‌(35),పుణేకు చెందిన శ్రీకాంత్‌(47), అపర్ణ సేరెన్‌ పార్క్‌ గచ్చిబౌలికి చెందిన యు.లక్ష్మయ్య(42)లను అదుపులోకి తీసుకొని గచ్చిబౌ లి పోలీసులకు అప్పగించారు. ఘటనా స్థలంలో 6సెల్‌ఫోన్లు, 38 కండోమ్‌ ప్యాకెట్లు, రూ.81,900 నగదు స్వాధీనం చేసుకున్నారు. బాధిత యు తులను రెస్క్యూ హోంకు తరలించనున్నారు. గచ్చిబౌలి పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. 

చదవండి: (ఏడాది నుంచి మాటువేసి.. పొదల్లోకి లాక్కెళ్లి యువతిపై అత్యాచారం)

మరిన్ని వార్తలు