Hyderabad: స్పా ముసుగులో వ్యభిచారం.. పరారీలో ఇషిక

8 May, 2022 14:51 IST|Sakshi
ప్రతీకాత్మకచిత్రం

సాక్షి, పంజగుట్ట: స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న సెంటర్‌పై దాడిచేసిన ఘటన పంజగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. పంజగుట్ట దుర్గానగర్‌లో ఓ ఇంటోల స్పా ముసుగులో వ్యభిచారం జరుగుతుందనే పక్కా సమాచారం అందుకున్న పంజగుట్ట క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ నర్సింహరాజు ముందుగా కానిస్టేబుల్‌ను విటుడిగా పంపారు.

వ్యభిచారం జరుగుతోందని తెలుసుకుని ఆకస్మికంగా దాడి చేశారు. నిర్వాహకురాలు ఇషిక పరారీలో ఉండగా డార్జిలింగ్‌కు చెందిన ఓ బాధితురాలితో ఈ వ్యాపారం నడిపిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితురాలిని పోలీసులు అదుపులోకి తీసుకుని రెండువేల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: (క్షుద్ర భయం కల్పించి.. మూడు నెలలుగా లైంగిక దాడి)

మరిన్ని వార్తలు