Hyderabad: వ్యభిచార గృహంపై దాడి.. ఐదుగురి అరెస్టు

11 May, 2022 07:47 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌(సనత్‌నగర్‌): వ్యభిచార గృహంపై ఎస్సార్‌నగర్‌ పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏజీకాలనీ సమీపంలోని విజయ కల్యాణ్‌ అపార్ట్‌మెంట్స్‌లోని ఓ ఫ్లాట్‌లో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్సార్‌నగర్‌ పోలీసులు సోమవారం రాత్రి ఆకస్మికంగా దాడి చేశారు. కేంద్రం నిర్వాహకుడు స్వామితో పాటు అతనికి సహకరిస్తున్న వాసంశెట్టి దుర్గ (35), రాగుల మల్లేష్‌ (32)లతో పాటు మరో యువతి, విటుడిగా వచ్చిన గోపాల్‌ అలియాస్‌ గోపీని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   

చదవండి: (Hyderabad: అపార్ట్ మెంట్‌లో వ్యభిచార దందా.. ముగ్గురు యువతులను..)

మరిన్ని వార్తలు