వీడియో: గురక శబ్ధంతో వీడిన వ్యభిచార ముఠా గుట్టు.. పోలీసులే షాక్‌ తిన్నారు

9 May, 2022 21:09 IST|Sakshi

బెంగళూరు: అప్పట్లో.. రాజులు యుద్ధాల సమయంలో శత్రు రాజ్యాలకు భయపడి రహస్య గదులను ఏర్పాటు చేసుకోవడం గురించి చరిత్రలో చదివి ఉంటాం.  సాధారణంగా.. ఐటీ రైడింగ్‌లకు భయపడి డబ్బును గోడల్లోనో, సీక్రెట్‌ గదుల్లోనూ, వాటర్‌ ట్యాంక్‌ల్లోనో దాచడం చూస్తుంటాం. అలాగే డబ్బు, నగలు, ముఖ్యమైన డాక్యుమెంట్లు భద్రపరిచే సీక్రెట్ రూమ్ చూసి ఉంటాం. కానీ, టాయిలెట్‌లో రహస్య గది ఒకటి ఏర్పాటు చేసుకుని.. అందులో గుట్టుగా వ్యభిచారం సాగించే ముఠా ఓ ముఠా వ్యవహారం తాజాగా వెలుగు చూసింది. 

ఈమధ్యకాలంలో ఇతర రాష్ట్రాల వ్యభిచార ముఠాల వ్యవహారాలు ఎక్కువగా బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో బ్రోకర్లు.. పోలీసుల కళ్లు గప్పేలా అతితెలివి ప్రదర్శిస్తున్నారు. కర్ణాటకలోని చిత్రదుర్గలో ఓ హోటల్‌పై రైడింగ్‌కు వెళ్లిన పోలీసులు షాక్‌కు గురయ్యారు. చిత్ర‌దుర్గ‌లోని ఓ చోట వ్య‌భిచారం చేస్తున్న‌ట్లు పక్కా స‌మాచారం అందుకుని స్పెషల్‌ టీం రైడ్‌కు వెళ్లింది. అయితే ఆ సమయంలో గదుల్లో వెతికినా ఏం కనిపించలేదు. దీంతో పోలీసులు ఘటనా స్థలంలోని బాత్‌రూమ్‌ను పరిశీలించగా..  ఒకచోట నుంచి గురక శబ్దం వినిపించింది. 

శబ్ధం ఎటువైపు వస్తుందోనని పరిశీలించిన ఓ అధికారికి.. టైల్స్‌ నుంచి రావడం వినిపించింది. అనుమానంతో ఆయన టైల్స్‌పై చెయ్యి వేయగానే.. అది కాస్త పక్కకు జరిగింది. దీంతో లోపల ఏర్పాటు చేసిన ఒక చిన్న గది బయటపడింది. పోలీసులు గదిని తెరిచి చూడగా.. అందులో ఒక చిన్న సెల్లార్ ఏర్పాటు చేశారు. అలా మొత్తం మూడు వ్యభిచార గృహాలు, ఒక క్లయింట్, ఒక బ్రోకర్ పట్టుబడ్డారు. బయట చూడ్డానికి మామూలు ప్రదేశమే అనిపించినా టాయిలెట్ లోపల ఇలా వ్యభిచార గృహం ఉండడం షాక్ కు గురిచేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలోనూ వైరల్‌ అవుతోంది.

మరిన్ని వార్తలు