Hyderabad: అపార్ట్ మెంట్‌లో వ్యభిచార దందా.. ముగ్గురు యువతులను..

10 May, 2022 07:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.1లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ను అద్దెకు తీసుకొని పోలీసుల కళ్లు గప్పి వ్యభిచార గృహం నడిపిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు అక్కడ దాడి చేశారు. ఫిజియోథెరపీ పేరుతో ఈ ఫ్లాట్‌ అద్దెకు తీసుకున్న సదాలక్ష్మి అనే నిర్వాహకురాలు ఆ ముసుగులో వ్యభిచార గృహం నిర్వహిస్తుండగా సమాచారం అందడంతో ఆదివారం అర్ధరాత్రి దాడి నిర్వహించారు. ముగ్గురు యువతులను పునరావాస కేంద్రానికి తరలించి సదాలక్ష్మిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. బంజారాహిల్స్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: (పరువు తీస్తానని భార్య బెదిరింపు.. భర్త ఆత్మహత్య)

మరిన్ని వార్తలు