హైటెక్‌ సిటీ: విదేశీ యువతులతో వ్యభిచారం

13 Apr, 2021 14:37 IST|Sakshi

స్టార్‌ హోటల్‌పై పోలీసుల దాడి 

అదుపులో ఐదుగురు యువతులు 

విటుడు అరెస్ట్, పరారీలో నిర్వాహకులు 

మాదాపూర్‌: హైటెక్‌ సిటీలోని ఓ స్టార్‌ హోటల్‌పై యాంటీ హ్యూమన్‌ ట్రాకింగ్‌ టీమ్‌ దాడి చేసి విదేశీ యువతులు, మోడళ్లతో నిర్వహిస్తున్న ఓ వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేసింది. నిర్వాహకుడు పరారీ కాగా, ఐదుగురు యువతులను, ఒక విటుడిని అదుపులోకి తీసుకొని మాదాపూర్‌ పోలీసులకు అప్పగించింది.  మాదాపూర్‌ సీఐ రవీంద్ర ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం...  మాదాపూర్‌లోని ఓ స్టార్‌ హోటల్‌లో ఉజబెకిస్తాన్‌కు చెందిన ముగ్గురు యువతులు, ఢిల్లీకి చెందిన ఇద్దరు యువతుల పేరిట ఐదు రూమ్‌లు బుక్‌ చేశారు.

నిర్వాహకులు అర్నవ్, ప్రిన్స్‌లు ఫోన్‌లో విటులతో మాట్లాడి హోటల్‌కు రప్పించి యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారు.  ఇదిలా ఉండగా, సోమవారం సాయంత్రం 5 గంటలకు సైబరాబాద్‌ యాంటీ హ్యూమన్‌ ట్రాకింగ్‌ టీమ్‌ సదరు హోటల్‌పై దాడి చేసింది. వ్యభిచార కార్యకలాపాలకు పాల్పడుతున్న ఉజబెకిస్తాన్‌కు చెందిన ముగ్గురు యువతులు, ఢిల్లీకి చెందిన ఇద్దరు యువతులను అదుపులోకి తీసుకుంది.

విటుడు షేక్‌పేట్‌కు చెందిన జ్ఞాన శేఖర్‌ మణికంఠన్‌(44)ను పోలీసులు అరెస్టు చేశారు. హోటల్‌ గదులలో రూ.29,560 నగదు, కండోమ్‌ ప్యాకెట్లు, సెల్‌ఫోన్‌ స్వా«దీనం చేసుకున్నారు. కాగా, యువతులను రెస్క్యూ హోంకు తరలిస్తామని సీఐ తెలిపారు. పరారీలో ఉన్న నిర్వాహకుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు