లాడ్జీల్లో రాసలీలలు.. పోలీసులకు దొరికేసిన ఐదు జంటలు

22 Sep, 2022 15:22 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

శ్రీకాకుళం క్రైం: జిల్లా కేంద్రంలో కొంతకాలంగా సాగుతున్న వ్యభిచారం గుట్టు రట్టయ్యింది. రెండో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ సీఐ ఈశ్వరప్రసాద్‌ తమ సిబ్బందితో ఏకకాలంలో రెండు లాడ్జీలపై దాడులు నిర్వహించి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేశారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక డే అండ్‌ నైట్‌ కూడలి సమీపంలో ఉన్న శ్రీరామ, ఎన్‌ఎస్‌ఆర్‌ లాడ్జీల్లో కొంతకాలంగా వ్యభిచారం జరుగుతున్నట్లు సమాచారం ఉండటంతో బుధవారం మధ్యాహ్నం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు.
చదవండి: కంపెనీలో అతడితో పరిచయం.. ప్రియుడి కోసం ఏం చేసిందంటే?

ఈ దాడుల్లో ఐదు జంటలు పట్టుబడినట్లు సీఐ తెలిపారు. తమ బంధువులతో కొందరు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆర్టీసీ కాంప్లెక్సు సమీపంలో ఇంకా కొన్ని లాడ్జీలు, బలగ తదితర ప్రాంతాల్లో వ్యభిచారం జరుగుతున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. లాడ్జిలో ఎవ రు రూమ్‌లో దిగినా పూర్తి వివరాలు ఆధార్‌ కార్డుతో సహా నోట్‌ చేసుకోవాలని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. దీనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు