ఎస్‌ఐ పరీక్షల స్కాంలో కొత్త కోణం.. కాలువలోకి ఓఎంఆర్‌ షీట్లు పడేసి..

14 May, 2022 07:45 IST|Sakshi
సీఐడీ ఆఫీసుకు ఆటోలో వస్తున్న ఏఈ మంజునాథ మేళకుంది (ఫైల్‌)

సీఐడీ అధికారుల విచారణలో 

నోరు విప్పిన మంజునాథ్‌ మేళకుంది

బనశంకరి(బెంగళూరు): ఎస్‌ఐ నియామకాల్లో చోటు చేసుకున్న అక్రమాలపై సీఐడీ అధికారులు కేసు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. కేసు వెలుగులోకి రాగానే సీఐడీ అధికారుల నుంచి తప్పించుకోవడానికి ఓఎంఆర్‌షీట్లను కాలువలోకి పడేసినట్లు ఎస్‌ఐ నియామక అక్రమాలతో సంబంధం ఉన్న సీఐడీ కస్టడీలో ఉన్న కలబురిగి నీరావరి శాఖ ఇంజినీర్‌ మంజునాథ్‌  నోరువిప్పాడు.

అసలైన ఓఎంఆర్‌షీట్‌కు, కార్బన్‌షీట్‌ను పోల్చి చూస్తే తేడా కనబడటం ఖాయమని భావించిన ఇతడితో డీల్‌ చేసుకున్న అభ్యర్థులు కార్బన్‌షీట్‌ను కలబురిగి నగర శివారులోని కోటనూరు వద్ద పెద్దకాలువలోకి పడేసినట్లు మంజునాథ్‌ సీఐడీ ముందు నోరువిప్పాడు. సీఐడీ అధికారులు రెండురోజుల క్రితం మంజునాథ్‌ను కాలువవద్దకు తీసుకెళ్లి పరిశీలించారు. కాగా ఈయన ఇంటిలో గతంలో సీఐడీ అధికారులు 12 హాల్‌టికెట్లను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. అదేవిధంగా పోలీసులకు లొంగిపోక ముందు ఇతను తన సెల్‌ఫోన్‌ను అళంద తాలూకా అమర్జా డ్యాంలోకి విసిరేసిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉండగా కేసులో ముఖ్యసూత్రధారి అయిన డీఎస్పీ శాంతకుమార్‌ను సీఐడీ అధికారులు  కోర్టులో హజరుపరిచి తమ అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. శాంతకుమార్‌ 1996 బ్యాచ్‌ సీఏఆర్‌  కానిస్టేబుల్‌గా ఎంపికై  2006లో  ఆర్‌ఎస్‌ఐ పరీక్ష రాసి ఉత్తీర్ణులయ్యారు. గుల్బర్గాలో ఏడాది శిక్షణ పూర్తి చేసుకున్నారు.  2007–08 నుంచి నియామక విభాగంలో శాంతకుమార్‌ మకాంవేశాడు. నియామకాల్లో ఏమిజరుగుతుంది అనేది తెలుసుకున్నారు. రెండేళ్ల క్రితం  సీఐ నుంచి డీవైఎస్‌పీగా పదోన్నతి పొందారు. పీఎస్‌ఐ పరీక్షల్లో  అక్రమాలకు పాల్పడి ఓఎంఆర్‌షీట్లు దిద్దినట్లు సీఐడీవిచారణలో తేలింది.

చదవండి: వివాహేతర సంబంధం: అర్ధరాత్రి బైక్‌పై వస్తుంటే అడ్డగించి..

     

మరిన్ని వార్తలు