‘ప్రియుడి’ హత్య.. ఆపై ఆత్మహత్యాయత్నం చేసిన యువకుడు

2 Mar, 2021 14:57 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

పుణెలో వెలుగు చూసిన దారుణం

డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయం, ప్రేమ

వేరే యువతిని వివాహం చేసుకోబోతున్న మృతుడు

దాన్ని జీర్ణించుకోలేక హత్య చేసిన నిందితుడు

ముంబై:  పుణెలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువకుడు.. 30 ఏళ్ల పీహెచ్‌డీ స్కాలర్‌ని హత్య చేశాడు. ఆ తర్వాత తను కూడా ఆత్మహత్యాయత్నం చేశాడు. కారణం ఏంటంటే ఈ ఇద్దరు యువకులు కొద్ది నెలలుగా ప్రేమలో ఉన్నారు. ప్రస్తుతం పీహెచ్‌డీ స్కాలర్‌కి పెళ్లి కుదరడంతో.. తట్టుకోలేకపోయిన నిందితుడు అతడిని హత్య చేశాడు. ఆ తర్వాత తాను ఆత్మహత్యాప్రయత్నం చేశాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఆ వివరాలు..

ఇంటీరియర్‌ డిజైనర్‌గా పని చేస్తోన్న రవిరాజ్‌ క్షీరసాగర్‌(24)కి, పుణె నేషనల్‌ కెమికల్‌ లాబొరేటరీలో పీహెచ్‌డీ స్కాలర్‌గా ఉన్న సుదర్శన్‌ బాబురావు పండిట్‌(30)తో ఓ డేటింగ్‌ యాప్‌ ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమకు దారి తీసింది. ఈ బంధం కొన్ని నెలల పాటు కొనసాగింది. ఇంతలో సుదర్శన్‌కి కుటుంబ సభ్యులు వేరే యువతితో వివాహం నిశ్చయించారు. ఈ విషయం రవిరాజ్‌ చేవిన పడింది. తనను వదిలి పెట్టి మరోక యువతిని వివాహం చేసుకోవడానికి వీల్లేదని సుదర్శన్‌ని హెచ్చరించాడు రవిరాజ్‌. 

అయితే సుదర్శన్‌ ఈ బెదిరింపులను పెద్దగా పట్టించుకోలేదు. ఈ క్రమంలో గత నెల 27న రవిరాజ్‌, సుదర్శన్‌ పీహెచ్‌డీ చేస్తోన్న నేషనల్‌ కెమికల్‌ లాబొరేటరీకి వెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో తాను వేరే యువతిని పెళ్లి చేసుకుంటానని సుదర్శన్‌ తేల్చి చెప్పాడు. దాంతో ఆగ్రహంతో ఊగిపోయిన రవిరాజ్‌ అతడిని దారుణంగా హత్య చేశాడు. గొంతు కోసి.. ముఖాన్ని రాళ్లతో కొట్టి గుర్తుపట్టరాని విధంగా మార్చాడు. ఆ తర్వాత రవిరాజ్‌ తన నివాసానికి వెళ్లి ఆత్మహత్యయాత్నం చేశాడు. ఇది గమనించి కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. 

ఇక నేషనల్‌ లాబొరేటరీలో హత్యకు గురైన సుదర్శన్‌ గురించి పోలీసులకు సమాచారం అందించారు. అతడి వద్ద లభించిన డాక్యుమెంట్స్‌ని బట్టి మరణించిన వ్యక్తిని సుదర్శన్‌గా గుర్తించారు పోలీసులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. రవిరాజ్‌తో అతడికున్న ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దాంతో పోలీసులు రవిరాజ్‌ గురించి వాకబు చేయగా.. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో ఉన్నట్లు తెలిసింది. దాంతో పోలీసులు హస్పిటల్‌కి వెళ్లి రవిరాజ్‌ని అదుపులోకి తీసుకున్నారు. ఇక పోలీసుల దర్యాప్తులో తానే సుదర్శన్‌ని హత్య చేశానని అంగీకరించాడు రవిరాజ్‌. పోలీసులు అతడిని అరెస్ట్‌ చేశారు.

చదవండి: 
డేటింగ్‌ యాప్‌: నగ్నంగా వీడియో కాల్‌..
‘డేటింగ్‌ ఫ్రెండే’ దోచేసింది

మరిన్ని వార్తలు