అత్యాచారయత్నం.. ఆయుధంతో కంట్లో పొడిచి..

6 Nov, 2020 10:32 IST|Sakshi

పుణె : మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు అమలు చేస్తున్నా నేరాలు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా అత్యాచార ప్రయత్నాన్ని ప్రతిఘటించిన ఓ మహిళను చిత్రహింసలకు గురిచేశాడు దుండగుడు. తనకు సహకరించలేదన్న ఆవేశంతో మహిళ కంట్లోకి ఆయుధాన్ని దించి రాక్షస ఆనందం పొందాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని పుణెలోచోటుచేసుకుంది. పుణెలోని తహసీల్‌ అనే గ్రామంలో బుధవారం 37 ఏళ్ల ఓ మహిళ రాత్రి సమయంలో బహిరంగ మల విసర్జనకు వెళ్లింది. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తి మహిళను వెనకనుంచి పట్టుకొని బలవంతంగా వేరే చోటుకు లాక్కెల్లాడు. చదవండి: వివాహితపై అత్యాచారం.. స్పృహ కోల్పోయి:!

అనంతరం ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించగా, ఈ దాడిని మహిళ ప్రతిఘటించింది. దీంతో కోపానికి గురైన దుండగుడు అతి కిరాతకంగా ఆమె కంట్లో బలమైన ఆయుధంతో పొడిచాడు. నొప్పితో బాధితురాలు గట్టిగా అరచడంతో స్థానికులు ఆమెను రక్షించడానికి వచ్చారు. దీంతో దుండగుడు అక్కడి నుంచి పరారవ్వగా.. స్థానికులు మహిళను ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే నిందితులను అదుపులోకి తీసుకుంటామని పుణె రూరల్‌ ఎస్పీ అభినవ్‌ దేశ్‌ముఖ్‌ తెలిపారు. చదవండి: స్నేహితుని భార్యపై లైంగిక దాడి..


 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా