పుంగనూరు కేసు.. అదే కీలకాధారం.. చల్లా బాబును అతిత్వరలో పట్టుకుంటాం: చిత్తూరు ఎస్సీ

18 Aug, 2023 17:51 IST|Sakshi

సాక్షి, చిత్తూరు: పుంగనూరులో పోలీసులపై దాడి కేసుకు సంబంధించిన 500 మంది నిందితులను గుర్తించామని.. వీళ్లలో 92 మందికి ఇప్పటివరకు అరెస్ట్‌ చేశామని జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి తెలిపారు. ఈ కేసులో దర్యాప్తు వివరాలను సాక్షికి తెలిపారాయన. 

‘‘ఫ్రీ ప్లాన్ గా పోలీసులపై దాడి చేశారు.  ఈ విషయాన్ని ఈ కేసులో ప్రధాన నిందితుడైన పుంగనూరు టీడీపీ ఇంఛార్జి చల్లా బాబు పీఏ గోవర్ధన్ రెడ్డి, డ్రైవర్ నరీన్ కుమార్ రిమాండ్ రిపోర్ట్ లో అంగీకరించారు. ఈ కేసులో ఇదే కీలక ఆధారం.  వీడియో పుటేజి ఆధారంగా మొత్తం 500 మంది నిందితులను గుర్తించాం, ఇప్పటి వరకు 92 మందిని అరెస్ట్ చేశాం, 408 మందిని ట్రేస్‌ చేయాల్సి ఉంది. 

‘‘ఈనెల 1వ తేదీ నాడు పోలీసులు పై దాడికి ప్లాన్ చేశారు, ముందుగా సమావేశం అయ్యారు. అనుకున్న విధంగా ఈనెల 4వ తేదీన దాడి చేశారు,విధ్వంసం సృష్టించారు. పక్కాగా ప్రీ ప్లాన్డ్‌గానే ఈ దాడి చేశారు. నిందితులిద్దరూ  రిమాండ్ రిపోర్ట్‌లో ఈ విషయాన్నే అంగీకరించారు. ప్రధాన నిందితుడు చల్లా బాబు  దక్షిణాది రాష్ట్రాల్లో లొకేషన్స్ మారుస్తున్నారు. అయినా అతిత్వరలో అరెస్ట్ చేస్తాం. చల్లా బాబు హైకోర్టు లో బెయిల్ కోసం అప్లై చేస్తే.. న్యాయపరంగా ఎదుర్కొంటున్నాం అని ఎస్పీ రిషాంత్‌రెడ్డి తెలిపారు.

ఇదీ చదవండి: పవన్‌పై క్రిమినల్‌ కేసులో కీలక పరిణామం
 

మరిన్ని వార్తలు