ఫిలిప్పీన్స్‌లో పంజాబీ దంపతుల దారుణ హత్య.. ఇంట్లోకి వెళ్లి కాల్పులు..

28 Mar, 2023 16:50 IST|Sakshi

మనీలా: పంజాబ్‌కు చెందిన దంపతులు ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలో దారుణ హత్యకు గురయ్యారు. శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. దుండగుడు తుపాకీతో ఇంట్లోకి ప్రవేశించి కాల్పులు జరిపి ఇద్దరినీ హతమార్చాడు.

హత్యకు గురైన భార్యాభర్తలను సుఖ్వీందర్ సింగ్‌(41), కిరణ్‌దీప్ కౌర్‌(33)గా గుర్తించారు. ఇద్దరూ పంజాబ్‌ జలంధర్ జిల్లా గొరాయాకు చెందినవారు. సుఖ్వీందర్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన కాసేపటికే  ఓ దుండగుడు తుపాకీతో వెళ్లి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. మొదట భర్తపై కాల్పులు జరిపి, ఆ తర్వాత భార్యపై రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు. దీంతో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సుఖ్వీందర్ 19 ఏళ్ల క్రితమే ఫిలిప్పీన్స్‌ వెళ్లి స్థిరపడ్డాడు. ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. మూడేళ్ల క్రితమే కిరణ్‌దీప్‌ కౌర్‌ను పెళ్లి చేసుకున్నాడు.

ఆదివారం ఎన్నిసార్లు ఫోన్ చేసినా సుఖ్వీందర్ కాల్ లిఫ్ట్ చేయలేదని అతని తమ్ముడు లఖ్వీర్ సింగ్ చెప్పాడు. దీంతో దగ్గర్లోనే ఉన్న తమ అంకుల్‌ను వెళ్లి చూడమన్నానని, అప్పటికే ఇద్దరూ చనిపోయి రక్తపు మడుగులో ఉన్నారని పేర్కొన్నాడు.
చదవండి: యూఎస్‌ టేనస్సీ: స్కూల్‌లో పూర్వ విద్యార్థి కాల్పులు.. చిన్నారులు, సిబ్బంది మృతి

మరిన్ని వార్తలు