హైదరాబాద్‌ నుంచి విదేశాలకు డ్రగ్స్‌

13 Dec, 2022 04:53 IST|Sakshi
స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ ప్యాకెట్లు పరిశీలిస్తున్న సీపీ 

రూ.9 కోట్ల విలువ చేసే 8.5 కేజీల డ్రగ్స్‌ స్వాధీనం 

అల్వాల్‌: హైదరాబాద్‌ నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాలకు డ్రగ్స్‌ను కొరియర్‌ ద్వారా తరలిస్తున్న ఐదుగురు సభ్యుల అంతర్జాతీయ ముఠాను రాచకొండ పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. వారివద్ద నుండి 9 కోట్ల రూపాయల విలువ చేసే 8.5 కేజీల సుడోపెడ్రిస్‌ అనే సింథటిక్‌ డ్రగ్‌ను స్వాధీనం చేసుకొన్నారు. రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ వివరాలను మీడియాకు వెల్లడించారు.

తమిళనాడుకు చెందిన రహీమ్, ఫరీద్, ఫైజల్‌ అనే వ్యక్తులు ప్రధాన సూత్రదారులుగా హైదరాబాద్, మహారాష్ట్ర కేంద్రాలుగా ఈ ముఠా కొనసాగుతోంది. సింథటిక్‌ డ్రగ్‌ను లుంగీల ప్యాకెట్‌ పేరుతో కొరియర్‌ ద్వారా ఇతర దేశాలకు సరఫరా చేస్తున్నారు. పక్కా సమాచారం ప్రకారం నాచారం పోలీసుల సహకారంతో మల్కాజిగిరి ఎస్‌ఓటీ పోలీసులు ఈ రాకెట్‌ను ఛేదించారు. ఈ డ్రగ్‌ ఒక కేజీ బహిరంగ మార్కెట్‌లో సుమారు కోటి రూపాయలకు విక్రయిస్తారన్నారు. రాబోయే కొత్త సంవత్సర వేడుకలను దృష్ట్రిలో పెట్టుకొని ఈ ముఠా విచ్చలవిడిగా డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నట్లు సీపీ తెలిపారు.  

మరిన్ని వార్తలు